BigTV English

Dil Raju : వెటరన్ డైరెక్టర్ తో దిల్ రాజు కొత్త ప్రాజెక్ట్… వారసుడి కోసం రిస్క్

Dil Raju : వెటరన్ డైరెక్టర్ తో దిల్ రాజు కొత్త ప్రాజెక్ట్… వారసుడి కోసం రిస్క్

Dil Raju : టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇటీవల కాలంలో వరస డిజాస్టర్ లను అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పటిలాగే బౌన్స్ బ్యాక్ అవ్వాలి అనుకుంటున్న ఈ స్టార్ ప్రొడ్యూసర్ 2025 కోసం వరుసగా కొన్ని కొత్త సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు ఒక ప్రముఖ దర్శకుడిని మళ్ళీ రిలాంజ్ చేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఆ డైరెక్టర్ ఎవరు? వారసుడి కోసం దిల్ రాజు చేయబోతున్న రిస్క్ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


వెటరన్ డైరెక్టర్ ను రీ లాంచ్  

టాలీవుడ్ లో అగ్ర నిర్మాత అయిన దిల్ రాజు 2025లో తన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి రిలీజ్ చేయబోతున్న వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. పక్కా ప్రణాళికతో ఆ సినిమాలను వచ్చే ఏడాది వరసగా రిలీజ్ చేయడానికి రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ దర్శకుడు కరుణాకర్ ను రీ లాంచ్ చేయడానికి ఆయన సిద్ధమయ్యారు అనే వార్త తాజాగా వినిపిస్తోంది.


రొమాంటిక్ ఎంటర్టైనర్ తో రీ ఎంట్రీ 

సెన్సిబుల్ డైరెక్టర్ కరుణాకరన్ గతంలో తొలిప్రేమ, వాసు, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ వంటి సినిమాలతో మంచి హిట్ లను అందించాడు. కానీ ఆ తర్వాత వరుస ప్లాఫ్ లను అందుకోవడంతో ఈ డైరెక్టర్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన 2018లో చివరిసారిగా ‘తేజ్ ఐ లవ్ యు’ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. కరుణాకర్ ఖాతాలో పడ్డ చివరి హిట్ మూవీ అంటే ప్రభాస్ హీరోగా నటించిన డార్లింగ్ మూవీనే. తాజాగా కరుణాకరణ్ అందించిన స్క్రిప్ట్ తో ఇంప్రెస్ అయిన దిల్ రాజు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ నడుస్తోంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో దిల్ రాజు వారసుడు సోదరుడి కుమారుడు ఆశిష్ ప్రధాన పాత్రలో నటించనున్నాడని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలవడనుంది.

ఆశిష్ కోసం దిల్ రాజు రిస్క్ 

‘రౌడీ బాయ్స్’ సినిమాలతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఆశిష్ ఖాతాలో ఇప్పటిదాకా ఒక్క హిట్ కూడా పడలేదు. వచ్చే ఏడాది ఆయన రెండు కొత్త సినిమాలలో నటించబోతున్నాడు. ఆశిష్ హీరోగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో రూపొందుతున్న చిన్న చిత్రం ‘సెల్ఫిష్’ 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తయ్యాక ఆగిపోయింది. ఈ మూవీకి 10 కోట్లకు పైగా బడ్జెట్ ను పెట్టారు. ఈ మూవీతో సుకుమార్ శిష్యుడు కాశీ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే ఏడాది పాటు వాయిదా పడింది. అంతలోపు ఆశిష్ ‘లవ్ మీ’ అనే సినిమాతో మరోసారి అదృష్టాన్ని కూడా పరీక్షించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘సెల్ఫిష్’ ప్రాజెక్ట్ త్వరలోనే రీస్టార్ట్ కాబోతోందని టాక్ నడుస్తోంది. మరోవైపు ప్రొడ్యూసర్ దిల్ రాజు వరుస ప్లాఫ్ లలో ఉన్నప్పుడు ఇలా అస్సలు ఫామ్ లో లేని డైరెక్టర్ తో వారసుడి కోసం సినిమా చేయడం అంటే రిస్క్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఆశిష్ కోసం దిల్ రాజు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×