BigTV English

HBD Puri Jagannadh: పూరీ చిరకాల కోరిక మెగాస్టార్ తీర్చేనా..?

HBD Puri Jagannadh: పూరీ చిరకాల కోరిక మెగాస్టార్ తీర్చేనా..?

HBD Puri Jagannadh.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ఈతరం డైరెక్టర్లలో ఫైరింగ్ అండ్ ఇన్స్పైరింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక దారి క్రియేట్ చేసుకొని, ఎంతోమందికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు. పూరీ జగన్నాథ్ ను ఇన్స్పైర్ గా తీసుకొని, అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు. వారంతా కూడా త్వరలో తమ టాలెంట్ ని ఉపయోగించి తమ గురువుకు మంచి సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈరోజు పూరీ జగన్నాథ్ బర్తడే ఈ సందర్భంగా ఆయన సినిమా కెరియర్ కు సంబంధించి, అలాగే ఆయన చిరకాల కోరిక ఏంటో ఇప్పుడు చూద్దాం.


చూడడానికి సింపుల్.. బరిలోకి దిగితే పక్కా మాస్..

చూడడానికి సింపుల్ గా కనిపించినా థింకింగ్, మేకింగ్ లో చాలా షార్ప్.. పేజీల కొద్దీ డైలాగ్స్ ను సింగిల్ లైన్ లో చెప్పేసి ప్రశంసలు అందుకున్నారు. ఇదే పూరీ జగన్నాథ్ ను స్పెషల్ డైరెక్టర్ గా మలిచింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో దూరదర్శన్ లో పనిచేశారు. ఇకపోతే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో సుమన్, కృష్ణ లాంటి పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు చేయాలనుకున్నారు. ముఖ్యంగా కృష్ణతో సినిమా కూడా దాదాపు కన్ఫర్మ్ అయింది. కానీ కొన్ని కారణాలవల్ల ఆగిపోయింది. ట్రెండ్ కు భిన్నమైన రూట్ ను క్రియేట్ చేసుకున్న హీరో అంటే సద్గుణ సంపన్నుడు సకల కళా వల్లభుడు అనే తెలుగు సినిమా సూత్రాన్ని చెరిపేసి , తన చిత్రాలతో కొత్త పుంతలు తొక్కించారు. ముఖ్యంగా మహేష్ బాబుతో పోకిరి , రవితేజతో ఇడియట్ చిత్రాలు చేసి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించారు. అంతేకాదు నాగార్జున తో శివమణి చేసి మరో విజయాన్ని అందుకున్నారు.


పూరి జగన్నాథ్ చిరకాల వాంఛ..

ముఖ్యంగా హీరోలలోని ఇంకో టాలెంట్ ను కూడా వెలికి తీసి, తెరపై చూపించే నైజం ఈయనది. అందుకే పూరీ జగన్నాథ్ సినిమాలంటే చాలా భిన్నంగా ఉంటాయని ఆడియన్స్ కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన పూరీ జగన్నాథ్ కి చిరకాల కోరిక ఒకటి మిగిలిపోయిందట. అదే మెగాస్టార్ చిరంజీవిని దర్శకత్వం చేయడం. గతంలో కూడా ఆటో జానీ అనే చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేయాలనుకున్నారు పూరీ జగన్నాథ్. కానీ ఆ కథ పట్టాలెక్కలేదు. మెగాస్టార్ తో సినిమా చేయలేకపోయినా.. రామ్ చరణ్ ను వెండితెరకు పరిచయం చేసే అవకాశాన్ని కొట్టేశాడు. కథ రొటీనే అయినా.. హీరోగా రాణించడానికి చరణ్ కి ఉన్న క్యాపబిలిటీస్ అన్నింటిని కూడా సినిమాలో చూపించి చిరుతతో అందరిని మెప్పించారు. అయితే చిరంజీవిని నేరుగా డైరెక్ట్ చేయాలన్న ఆయన కల మాత్రం ఇంకా నెరవేరలేదు. మరి ఇప్పటికైనా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తారా..? నటించి ఆయన కలను నెరవేరుస్తారా..? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.మరి మెగాస్టార్ చిరంజీవితో దర్శకత్వం వహించే ఛాన్స్ పూరీకి రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×