Dil Raju’s Upcoming Films : ఇప్పుడు కాస్త వెనక పడ్డారు కానీ ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ అంటే దిల్ రాజు పేరు వినిపించేది. దిల్ రాజు సినిమాలు ఏ సీజన్ లో రిలీజ్ అయిన అవ్వకపోయినా ఖచ్చితంగా సంక్రాంతికి మాత్రం ఒక సినిమా రిలీజ్ అవుతూ వస్తుంది. శ్రీ వెంకటేశ్వర బ్యానర్స్ నుండి సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రతి సినిమా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసి అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. వెంకటేష్ మహేష్ బాబు నటించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఆ రోజుల్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలతో పాటుగా రిలీజ్ అయిన శతమానం భవతి కూడా అద్భుతమైన ఘనవిజయం సాధించింది. రెండు స్టార్ హీరోల సినిమాలు మధ్యలో కూడా శతమానం భవతి అద్భుతమైన స్కోర్ చేసింది. ఆడియన్స్ అంతా కూడా ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఈ సంక్రాంతికి కూడా రెండు సినిమాలను సిద్ధం చేశాడు దిల్ రాజు.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజెర్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం ఈ రెండు సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదల కానున్నాయి. కేవలం 2025 సంక్రాంతి మాత్రమే కాకుండా ఆ ఇయర్ మొత్తానికి కూడా సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశాడు దిల్ రాజు. ప్రస్తుతం దిల్ రాజు ఏడు సినిమాలకి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంక్రాంతి సీజన్ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న తమ్ముడు సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో నితిన్ హీరోగా కనిపిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయం అవుతున్న ‘ఆకాశం దాటి వస్తావా’ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాతో ఒక కొత్త దర్శకుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు.
Also Read : Game Changer Pre-release Event: గేమ్ చేంజర్ ఈవెంట్ డేట్ ఫిక్స్
అయితే ఈ బ్యానర్ లో ఎప్పుడో మొదలైన సినిమా సెల్ఫిష్. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావలసి ఉంది. కొన్ని కారణాల వలన ఈ సినిమాను మధ్యలో ఆపారు. ఈ సినిమాకి సంబంధించి సుకుమార్ పుష్ప అయిపోయినంత వరకు కూడా ఈ సినిమాని హోల్డ్ లో పెట్టమని చెప్పారట, సుకుమార్ దగ్గర అసోసియేట్ గా పనిచేసిన కాశీ ఈ సినిమాకు దర్శకుడుగా వర్క్ చేస్తున్నాడు. పుష్ప షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ సినిమా గురించి సుకుమార్ కేర్ తీసుకోనున్నారు. ఈ సినిమాలతో పాటు 2025లో మరికొన్ని సినిమాలు మొదలవ్వనున్నాయి. దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ పై రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా మొదలుకానుంది. ఆ తర్వాత వేణు దర్శకత్వంలో నితిన్ హీరోగా ఎల్లమ్మ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది. ఈ ప్రాజెక్టు అన్నింటిని దిల్ రాజు స్వయంగా అనౌన్స్ చేశారు.