Hyd KPHB: మృత్యువు ఏ రూపంలో వస్తుందో.. ఎలా వస్తుందో.. ఎప్పుడు వస్తుందో చెప్పడం తరమా.. కాదు కానీ కాదు.. అలాంటిదే ఈ ఘటన. కార్తీక మాసం కావడంతో అందరిలాగానే ఆ యువకుడు ఆలయానికి వెళ్లాడు. స్వామి వారి దర్శనానికి ముందు ప్రదక్షిణలు చేస్తున్నాడు ఆ యువకుడు. అంతలోనే తనువు చాలించాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది.
హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఆంజనేయస్వామి ఆలయంకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కార్తీక మాసం కావడంతో స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. సాధారణంగా కార్తీక మాసంలో ఆలయాలలో పూజలు నిర్వహిస్తే, పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఎక్కడ చూసినా ఆలయాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి. ఇదే రీతిలో స్వామివారి దర్శనానికి వచ్చిన ఓ యువకుడు, దురదృష్టవశాత్తు ప్రదక్షిణలు చేస్తూనే, గుండెపోటుకు గురై మృతి చెందారు.
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన విష్ణువర్ధన్ (31) అనే యువకుడు రోజువారి మాదిరిగానే ఆంజనేయస్వామి ఆలయానికి మంగళవారం ఉదయం చేరుకున్నాడు. బయట ఆలయ గడపను మొక్కి, స్వామివారి ఆలయంలోకి అడుగుపెట్టిన విష్ణువర్ధన్, ముందుగా ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. అయితే ప్రదక్షిణలు చేస్తున్న క్రమంలో విష్ణువర్ధన్ గుండెపోటుకు గురయ్యారు. హఠాత్తుగా సొమ్మసిల్లి పడిపోవడంతో, స్థానిక భక్తులు వెంటనే వైద్యశాలకు తరలించారు.
Also Read: Today Gold Rate: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. ఇంకా తగ్గే ఛాన్స్ ఉందా..
అయితే వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి, విష్ణువర్ధన్ అప్పటికే తనువు చాలించినట్లు తెలిపారు. విష్ణువర్ధన్ ప్రదక్షిణలు చేస్తూ సొమ్మసిల్లి పడిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. అయితే ఆలయానికి వెళ్లి, ఇంటికి చేరకపోగా అతని తల్లిదండ్రులు అసలేం జరిగిందనే కంగారులో ఉండగా వారికి అసలు విషయం తెలిసింది. విష్ణువర్ధన్ గుండెపోటుకు గురై మృతి చెందినట్లు సమాచారం అందుకున్న వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహిస్తూ విష్ణువర్ధన్ మృతి చెందినట్లు సమాచారం అందుకున్న స్థానిక ప్రజలు దిగ్బ్రాంతికి గురయ్యారు.
ఆలయంలో ప్రదక్షిణలు చేస్తుండగా గుండెపోటుతో యువకుడు మృతి
హైదరాబాద్ కేపీహెచ్బీ పరిధిలోని ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లిన యువకుడు విష్ణువర్ధన్
ప్రదక్షిణలు చేస్తుండగా ఒక్కసారిగా స్తంభాన్ని పట్టుకుని కుప్పకూలిపోయిన యువకుడు
ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే… pic.twitter.com/Nrr6evdjxc
— BIG TV Breaking News (@bigtvtelugu) November 12, 2024