Game Changer Pre-release Event: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ కంప్లీట్ రోల్ లో కనిపిస్తున్న సినిమా ఇది. అలానే శంకర్ తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇది. వాస్తవానికి ఈ కథను కార్తీక్ సుబ్బరాజ్ సిద్ధం చేశాడు. కథ పూర్తయిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ తో డిస్కస్ చేస్తున్న తరుణంలో ఇది శంకర్ సార్ లెవెల్ లో ఉంది అని వాళ్లకు అనిపించింది. అక్కడితో ఈ కథను దర్శకుడు శంకర్ కు ఇవ్వడం జరిగింది. ఈ సినిమాను వాస్తవానికి పవన్ కళ్యాణ్ తో చేయాలని శంకర్ అనుకున్నాడు. కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ కున్న బిజీ షెడ్యూల్స్ వలన ఈ సినిమాను మనం రాంచరణ్ తేజ్ తో చేద్దామని దిల్ రాజు చెప్పడం, ఆ తర్వాత చరణ్ కి ఈ కథ చెప్పడం, చరణ్ కి కథ నచ్చినందుకు సినిమా పట్టాలెక్కడం జరిగింది.
ఇకపోతే ఈ సినిమా సంక్రాంతి కానుక జనవరి 10న రిలీజ్ కానుంది. వాస్తవానికి ఈ సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తానని మొదట అనౌన్స్ చేశారు. అయితే సంక్రాంతి సీజన్ బాగా వర్కౌట్ అవుతుందని దిల్ రాజు ప్లాన్ చేశారు. జనవరి 10న మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా రిలీజ్ అవుతుందని, చాలా రోజుల క్రితం ప్రకటించింది చిత్ర యూనిట్. అయితే అదే రోజున గేమ్ చేంజర్ ప్లాన్ చేయడంతో మెగాస్టార్ సినిమా వాయిదా పడింది. ఇక ఇప్పటివరకు గేమ్ చేంజర్ సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. ఆ రెండు పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కూడా సినిమా పైన మంచి అంచనాలను పెంచింది. కేవలం 24 గంటల్లోనే 55 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 1న జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది.
Also Read : Prabhas : డార్లింగ్‌లో ఓ స్పెషల్ టాలెంట్… సినిమా పిచ్చొళ్లకు కూడా సాధ్యం కానిది.. ప్రభాస్ సొంతం
వాస్తవానికి ఎప్పుడో మొదలైన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అవుతుంది. శంకర్ ఈ సినిమాతోపాటు భారతీయుడు 2 సినిమాను కూడా చేశాడు. భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే, దానికి సీక్వెల్ గా వచ్చిన భారతీయుడు 2 మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. అసలు శంకర్ ఇలాంటి సినిమాని ఎలా చేశాడు అని చాలామంది విమర్శలు కూడా చేశారు. భారతీయుడు 2 రిలీజ్ అయిన తర్వాత గేమ్ చేంజర్ సినిమా మీద కూడా చాలామందికి అనుమానాలు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత కథ శంకర్ ది కాదు కాబట్టి కొంతమంది పరవాలేదు అనుకున్నారు. ఏదేమైనా శంకర్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడని చాలామంది అంచనా వేస్తున్నారు. చరణ్ గ్లోబల్ స్టార్ ఇమేజ్ కి కూడా ఈ సినిమా పెద్ద ప్లస్ అవుతుంది అని కొంతమంది ఊహిస్తున్నారు.