Dil Ruba : టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచి సినిమాలు తీస్తూ ప్రేక్షకుల మన్నలను పొందుతున్నాడు. సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన కష్టంతోపాటు, టాలెంట్ ను ఇంప్రూవ్ చేసుకుంటూ హీరోగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.ఇటీవల ‘క’ సినిమాతో భారీ విజయం సాధించి మంచి ఫాంలోకి వచ్చాడు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందింది.
ఇప్పుడు మరోసారి లవర్ బాయ్‌గా అలరించేందుకు సిద్ధమవుతున్నాడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం అతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దిల్ రూబా’. ఈ సినిమాను విశ్వకరుణ్ దర్శకత్వం వహిస్తుండగా, రుక్సార్ థిల్లాన్ కథానాయికగా నటిస్తోంది. హృదయాన్ని హత్తుకునే ప్రేమకథతో రూపొందించిన ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.
తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ కథానాయకుడు, ఇతర పాత్రలను పరిచయం చేస్తూ ఆసక్తికరంగా సాగింది. “తప్పు చేసిన తర్వాత చెప్పే సారీకి, అవసరం తీరిపోయిన తర్వాత చెప్పే థాంక్స్‌కి నా దృష్టిలో విలువ లేదు” అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులో కిరణ్ అబ్బవరం లవర్ బాయ్‌గా కనిపించడంతో పాటు, యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆకట్టుకున్నాడు.
‘క’ సినిమాలో మాస్ యాక్షన్ హీరోగా కనిపించిన కిరణ్, ‘దిల్ రూబా’లో కొత్త అవతారం ఎత్తాడు. సినిమా మార్చి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ట్రైలర్‌కు వచ్చిన విశేష స్పందన చూస్తుంటే, ఈ సినిమా మరో హిట్ కొట్టేలా కనిపిస్తోంది. కాగ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింద. సినిమాలో కొన్ని డైలాగ్స్ కథకు మంచి బూస్ట్ ఇవ్వబోతున్నట్టు స్పష్టమౌతుంది. క చిత్రంలాగే ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ వస్తుందన చిత్ర యూనిట్ భావిస్తుంది. మరి ప్రేక్షక దేవుళ్లు ఈ చిత్రాన్ని ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాలి.