BDRCL Recruitment: నిరుద్యోగులకు ఇది శుభవార్త. డిగ్రీ, సీఎ, సీఎఫ్‌ఏ, హెచ్‌ఆర్, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, బీటెక్(సివిల్), డిప్లొమా(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) పాసైన అభ్యర్థులకు సువర్ణకాశం అనే చెప్పవచ్చు. ఢిల్లీలోని భరుచ్ దహేజ్ రైల్వే కంపెనీ లిమిటెడ్ (BDRCL)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఢిల్లీ, భరుచ్ దహేజ్ రైల్వే కంపెనీ లిమిటెడ్ (BDRCL) ఒప్పంద ప్రాతిపదికన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్చి 20న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 11
ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పలు విభాగాల్లో ఈ వెకెన్సీలు ఉన్నాయి.
ఫైనాన్స్, హెచ్ఆర్, అకౌంట్స్, ట్రాక్, వర్క్స్, టీఆర్‌డీ అండ్ ఎలక్ట్రికల్, సిగ్నల్, టెలికామ్ విభాగాల్లో ఈ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
వెకెన్సీ వారీగా పోస్టులు..
చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్(సీఎఫ్‌ఓ): 01
మేనేజర్(హెచ్/అడ్మినిస్ట్రేషన్): 01
మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్(ఫైనాన్స్ అకౌంట్): 02
అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్ అకౌంట్): 01
మేనేజర్(సివిల్): 01
సీనియర్ ఏఎం/ఏఎం-ట్రాక్: 01
సీనియర్ ఏఎం/ఏఎం-వర్క్స్: 01
సీనియర్ ఏఎం/ఏఎం-టీఆర్‌డీ అండ్ ఎలక్ట్రికల్: 01
సీనియర్ ఏఎం/ఏఎం-సిగ్నల్: 01
సీనియర్ ఏఎం/ఏఎం-టెలికమ్: 01
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 మార్చి 20
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో సీఎ, సీఎఫ్ఏ, డిగ్రీ, హెచ్ఆర్, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, సివిల్ విభాగం, డిప్లొమా(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్)లో బీటెక్ పాసై ఉంటే సరిపోతుంది. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణిలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సు ఉంటుంది. 2025 ఫిబ్రవరి 20 నాటికి చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగానికి 45 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌కు 30 ఏళ్లు, మిగతా పోస్టులకు 40 ఏళ్లు నిండి ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగానికి నెలకు రూ.70,000 – రూ.2,00,000, సీనియర్ అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ ఉద్యోగానికి రూ.60,000, అసిస్టెంట్ మేనేజర్(ఫైనాన్స్ అకౌంట్) ఉద్యోగానికి రూ.30,000 – రూ.1,20,000, మేనేజర్(ఎఫ్ అండ్ ఏ) ఉద్యోగానికి రూ.50,000 – రూ.1,60,000, అసిస్టెంట్ మేనేజర్(ఎఫ్ అండ్ ఏ) ఉద్యోగానికి రూ.40,000 – రూ.1,40,000 వేతనం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్, ఈ మెయిల్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ-మెయిల్: agmhr@bdrail.in
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: http://www.bdrail.in/
ALSO READ: SECR Recruitment: టెన్త్, ఐటీఐ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేదు.. పూర్తి వివరాలివే..
ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 211
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 20