Diljit Dosanjh : పంజాబీ సంచలన గాయకుడు దిల్జిత్ దోసాంజ్ (Diljit Dosanjh) ఇటీవల కాలంలో తన ‘దిల్ లుమినాటి టూర్’ కాన్సర్ట్ కారణంగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పటికే దేశంలోని అనేక నగరాల్లో ఆయన కాన్సర్ట్ లు నిర్వహించారు. చివరగా ఆయన చండీగఢ్ మ్యూజిక్ కాన్సర్ట్ లో పర్ఫామ్ చేశారు. కానీ ఇండియాలో ఆయన షోను ఎక్కడ ప్లాన్ చేసినా సరే ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా దిల్జిత్ దోసాంజ్ ముంబై కాన్సర్ట్ లో కూడా ఇదే జరిగింది. ఈ విషయంపై దిల్జీత్ స్పందించారు. సాగర మథనాన్ని ఉదాహరణగా చూపిస్తూ శివుడిలాగే తాను కూడా విషాన్ని తాగుతానని, కానీ దానిని లోపలికి రానివ్వనని చెప్పాడు. పైగా ఆయన ‘పుష్ప 2’లో పుష్ప రాజ్ స్టైల్ లో సమాధానం చెప్పడం విశేషం.
‘దిల్ లుమినాటి టూర్’ కాన్సర్ట్ లలో మద్యం, డ్రగ్స్‌కు సంబంధించిన పాటలు పాడినట్లు దిల్జిత్ దోసాంజ్ (Diljit Dosanjh)పై ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలో ఆయనకు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు నోటీసులు జారీ చేశాయి. హైదరాబాద్ లో కూడా టీఎస్ గవర్నమెంట్ ఈ ఆంక్షలు విధించడంతో పాటు, కొన్ని పాటలపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దిల్జిత్‌కి నోటీసు జారీ చేసింది. మ్యూజిక్ కాన్సర్ట్ లో భాగంగా మద్యం, డ్రగ్స్ ఉన్న పాటలు పాడకుండా ఆంక్షలు విధించింది. అయితే దీనిపై దిల్జీత్ అసహనం వ్యక్తం చేశారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
ముంబైలో జరిగిన మ్యూజిక్ కాన్సర్ట్ లో దిల్జిత్ దోసాంజ్ (Diljit Dosanjh) అభిమానులతో మాట్లాడుతూ ఆందోళన చెందవద్దని అన్నారు. ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి వచ్చారంటే వారికి డబుల్ ఫన్ ఇస్తానని హామీ ఇచ్చాడు. వైరల్ వీడియోలో దిల్జిత్ దోసాంజ్ మాట్లాడుతూ ‘నిన్న నా ఈవెంట్ కు సంబంధించి ఏదైనా అడ్వయిజరీ జారీ చేశారా? అని నా టీంను అడిగాను. వాళ్ళు అంతా బాగానే ఉందని చెప్పారు. ఈ రోజు ఉదయం నిద్ర లేవగానే నాకు వ్యతిరేకంగా అడ్వయిజరీ జారీ అయిందని తెలిసింది. కానీ టెన్షన్ పడకండి. ఆంక్షలన్నీ నాపై ఉన్నాయి. ఇక్కడ ఆనందించడానికి వచ్చిన మీకు రెట్టింపు ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. ఈ రోజు ఉదయం నేను యోగా చేస్తున్నప్పుడు నాకు ఓ ఆలోచన వచ్చింది. అదేంటంటే నేను నేటి పర్ఫార్మెన్స్ ను ఒక స్టోరీతో ప్రారంభిస్తాను.
సాగర మథనం జరిగినప్పుడు బయటకు వచ్చిన అమృతాన్ని దేవతలు సేవించారు. అయితే విషాన్ని మాత్రం శివుడు తాగాడు. కానీ ఆ విషాన్ని శివుడు తనలోనికి తీసుకోలేదు. గొంతులో అలాగే ఉంచుకున్నాడు. అందుకే అతడిని నీలకంఠుడు అంటారు. కాబట్టి నేను నేర్చుకున్నది ఏమిటంటే… జీవితం, ప్రపంచం మీపై ఎంత విషం చిమ్మినా… మీరు దానిని ఎప్పటికీ లోపలకు తీసుకోకూడదు. మీ పనిపై ఎలాంటి ఎఫెక్ట్ పడనివ్వద్దు. మిమ్మల్ని అడ్డుకుంటారు, అంతరాయం కలిగిస్తారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా అస్సలు టెన్షన్ పడొద్దు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి” అంటూ దిల్జీత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ‘పుష్ప’ స్టైల్ లో “ఆజ్ ఝుకేగా నహీ” అంటూ దిల్జిత్ (Diljit Dosanjh) స్పీచ్ ను ముగించాడు.