Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి హరికృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన కళ్యాణ్ రామ్.. విజయాపజయాలను పక్కన పెట్టి.. తనకు నచ్చిన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేవాడు. అయితే అవన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఆనించలేకపోయాయి. దీంతో చాలావరకు ఇండస్ట్రీలో కళ్యాణ్ రామ్ సినిమాలను పెద్దగా లెక్కలోకి తీసుకోవడం మానేశారు. అయితే కళ్యాణ్ రామ్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడులా వరుస సినిమాలు చేస్తూనే వచ్చాడు. చివరకు బింబిసార అనే సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ ను అందుకున్నాడు.
ఇక ఈ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ సినిమాలపై కూడా అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకుంటున్నారు. అయితే బింబిసార తరువాత రెండు సినిమాలు చేసినా అవి ఆశించని ఫలితాన్ని అందించలేకపోయాయి. ఇక ఎలాగైనా మరో హిట్ అందుకోవాలని ఈ హీరో గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. అందులో భాగంగానే కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం NKR21. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఆయనే స్వయంగా నిర్మిస్తున్నాడు.
Devara: కమిట్మెంట్ అడిగితే తప్పేంటి.. ఒక్కసారిగా షాక్ ఇచ్చిన దేవర బ్యూటీ..!
ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ నటిస్తోంది. సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత సీనియర్ నటి విజయశాంతి.. ఈ సినిమా కథ నచ్చి ఇందులో నటించడానికి ఒప్పుకుంది. ఇందులో ఆమె ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విజయశాంతి – కళ్యాణ్ రామ్ కాంబో అనగానే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఎలాంటి కథలు పడితే అలాంటివి తాను చేయనని, కథలో తన పాత్రలో బలం ఉంటేనే చేస్తానని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో ఆమె నటించడంతో అందరూ ఎంతో ఆసక్తిగా NKR21 కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక తాజాగా ఈ సినిమా కోసం బాలీవుడ్ నటుడును కూడా రంగంలోకి దింపారు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్స్.. టాలీవుడ్ లో విలన్స్ గా మారుతున్న ట్రెండ్ నడుస్తుంది. దేవర లో సైఫ్ ఆలీఖాన్, ఓజీలో ఇమ్రాన్ ఖాన్.. ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ కోసం సోహైల్ ఖాన్ దిగాడు. టాలీవుడ్ కు సోహైల్ ఖాన్ ను పరిచయం చేయడం ఆనందంగా ఉందంటూ మేకర్స్ అధికారికమ్హా ఆయన పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ లో బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో కళ్ళజోడు పెట్టుకొని సోహైల్ చాలా కోపంగా కనిపించాడు.
ఈ ఏడాది పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్స్ వీరే..
ఇటీవల ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్వహించారు. ఆ షెడ్యూల్‌లో కళ్యాణ్ రామ్‌తో పాటు సోహైల్ ఖాన్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. సోహైల్.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అన్న విషయం తెల్సిందే. ఇప్పటికే దేవర సినిమాతో సైఫ్ ఆలీఖాన్ ను పరిచయం చేసిన ఎన్టీఆర్ ఆర్ట్స్.. ఇప్పుడు సోహైల్ ఖాన్ ను తెలుగుకు పరిచయం చేస్తుంది. మరి ఈ సినిమాతో సోహైల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.