Punjab 95: ఇండియాలో ఇప్పటికే ఎన్నో కాంట్రవర్షియల్ సినిమాలు వచ్చాయి. ఆ లిస్ట్‌లో మరో సినిమా యాడ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అదే ‘చమ్కీలా’ ఫేమ్ దిల్జీత్ దోసాంజ్ హీరోగా నటించిన ‘పంజాబ్ 95’. ఒక కాంట్రవర్షియల్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఇన్నాళ్లుగా సీబీఎఫ్‌సీ దగ్గర సెన్సార్ సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తూ ఉంది. మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత దీనికి సెన్సార్ పూర్తయ్యింది. అంటే విడుదలకు సిద్ధమయ్యింది. ఈ విషయాన్ని దిల్జీత్ దోసాంజ్.. తన సోషల్ మీడియాలో సంతోషంగా షేర్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా గురించి ఇప్పటివరకు పెద్దగా ప్రేక్షకులకు తెలియదు. ఇంతకీ ఈ మూవీలో ఉన్న కాంట్రవర్సీ ఏంటో చూసేయండి..
మూడేళ్లుగా వెయిటింగ్
దిల్జీత్ దోసాంజ్ (Diljit Dosanjh) హీరోగా నటించిన ‘పంజాబ్ 95’ సినిమా మూడేళ్ల క్రితమే సెన్సార్ కోసం సీబీఎఫ్‌సీ దగ్గరకు వెళ్లింది. కానీ ఇప్పటివరకు ఈ మూవీకి సెన్సార్ అవ్వకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇది మానవ హక్కుల యాక్టివిస్ట్ అయిన జశ్వంత్ సింగ్ కల్రా జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. 80, 90ల్లో పంజాబ్‌లో సిక్ యువతపై జరిగిన దాడులు, హత్యలు, కిడ్నాప్స్ గురించి ఈ సినిమాలో చూపించాడు దిల్జీత్. ఇలాంటి ఒక నిజంగా జరిగిన సంఘటనతో, అంతే కాకుండా సెన్సిటివ్ కంటెంట్‌తో ‘పంజాబ్ 95’ తెరకెక్కింది కాబట్టి ఈ మూవీలో కట్స్ చేయడానికి సెన్సార్‌కు ఇంత సమయం పట్టింది. ముందుగా ఈ సినిమాలో 85 కట్స్ అని సెన్సార్ అనుకున్నా.. ఆ తర్వాత కౌంట్ 120కు పెరిగింది.
Also Read: నొప్పితో బాధపడుతుంటే ఆ దర్శకుడు అలా అన్నాడు.. నిత్యా మీనన్ ఆసక్తికర కామెంట్స్
ఒప్పుకునేది లేదు
జశ్వంత్ సింగ్ కల్రా (Jaswant Singh Kalra) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా అయినా కూడా హీరో పేరును మార్చమని మేకర్స్‌ను సెన్సార్ బోర్డ్ రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా ఇది నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది అని చెప్తూ ప్రమోట్ చేయవద్దని కూడా ఆదేశించింది. పైగా టైటిల్ కూడా అతడి పేరు పెట్టొద్దని తెలిపింది. ‘సట్లజ్’ అనే టైటిల్ అయితే మూవీకి ఓకే అని చెప్పింది. సెన్సార్ బోర్డ్ చెప్పిన మార్పులకు ‘పంజాబ్ 95’ డైరెక్టర్ అయిన హనీ తెహ్రాన్, నిర్మాత రోనీ స్క్రూవాలా ఒప్పుకోలేదని తెలుస్తోంది. హీరో పేరు, టైటిల్ మార్చేస్తే ఇది బయోగ్రాఫీ సినిమా నుండి ఫిక్షనల్ కథలాగా మారిపోతుందని వారు ఫీల్ అవుతున్నట్టు సమాచారం.
బయటే సెటిల్‌మెంట్
‘పంజాబ్ 95’కు సెన్సార్ బోర్డ్ ఇచ్చిన అన్ని కట్స్‌లో 22 కట్స్ చేయడానికి తాము సిద్ధమే అని నిర్మాత రోనీ తెలిపారు. ఇదే విషయంపై కోర్టును కూడా ఆశ్రయించారు. కానీ దీనికి సంబంధించిన సెటిల్‌మెంట్ కోర్టు బయటే జరిగింది. అదే సమయంలో పంజాబ్‌లో సిక్ యువత మరణాల సంఖ్యను కూడా రివీల్ చేయవద్దని సెన్సార్ ఆదేశించింది. మొత్తానికి అన్ని చర్చల తర్వాత ‘పంజాబ్ 95’ (Punjab 95) విడుదలకు సిద్ధమయ్యింది. కానీ ఈ సినిమా థియేటర్‌లో విడుదల అవుతుందా లేక నేరుగా ఓటీటీలో వస్తుందా అనే విషయంపై క్లారిటీ లేదు. ఇప్పటికే ‘చమ్కీలా’ లాంటి కాంట్రవర్షియల్ మూవీతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న దిల్జీత్.. మరో కాంట్రవర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ਪੰਜਾਬ ‘95
In February pic.twitter.com/3o1K7GBuvO
— DILJIT DOSANJH (@diljitdosanjh) January 11, 2025