Nithya Menen: ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా, అనిపించింది అనిపించినట్టుగా చెప్పే నటీమణులు చాలా తక్కువమంది ఉంటారు. చాలావరకు తనతో కలిసి పనిచేసే ఇతర సినీ సెలబ్రిటీల గురించి పాజిటివ్‌గా గానీ, నెగిటివ్‌గా గానీ రియాక్ట్ అవ్వకుండా చాలా బ్యాలెన్స్‌గా ఉండేవారే ఎక్కువ. కానీ నిత్యా మీనన్ అలా కాదు.. తనకు అనిపించింది మొహం మీద చెప్పేస్తుంది. దాని వల్ల తన తరువాతి ప్రాజెక్ట్స్‌కు ఎఫెక్ట్ అవుతుందా అని పెద్దగా ఆలోచించదు. ఇప్పటికే చాలాసార్లు ఇంటర్వ్యూల్లో నిత్యా మీనన్ చేసిన కామెంట్స్, పబ్లిక్‌లో తన రియాక్షన్స్ వైరల్ అయ్యాయి. తాజాగా ఒక దర్శకుడి గురించి నిత్యా మీనన్ (Nithya Menen) చేసిన వ్యాఖ్యలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి.
ఎలాగైనా కష్టపడాల్సిందే
మామూలుగా సినీ పరిశ్రమలో పనిచేసే చాలామందికి మానవత్వం ఉండదు అని, నటీనటులు అంటే ఎలాంటి ఇబ్బంది అయినా పక్కన పెట్టి పనిచేయాలని అనుకుంటారని బయటపెట్టింది నిత్యా మీనన్. ‘‘శారీరికంగా ఎంత కష్టంగా ఉన్నా, ఎంత అనారోగ్యంతో ఉన్నా వచ్చి పర్ఫార్మ్ చేయాలనే మేకర్స్ అనుకుంటారు. అంతే. మాకు కూడా అదే అలవాటు అయిపోతుంది. ఏం జరిగినా మేము కష్టపడుతూనే ఉండాలి’’ అంటూ ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాల గురించి కూడా చెప్పుకొచ్చింది నిత్యా మీనన్. మామూలుగా తన అనుభవాల గురించి బయటపెట్టడానికి నిత్యా ఎప్పుడూ వెనకాడదు. మరోసారి అదే జరిగింది.
Also Read: సౌత్ వాళ్ళను లెస్బియన్ అని నమ్మించా… చెర్రీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్
మేల్ డైరెక్టర్‌తో అలా
మిస్కిన్ దర్శకత్వంలో నిత్యా మీనన్ కీలక పాత్రలో ‘సైకో’ అనే సినిమా వచ్చింది. 2020లో విడుదలయిన ఈ మూవీలో నిత్యా యాక్టింగ్ చాలా బాగుందంటూ ప్రేక్షకులు ప్రశంసించారు. ఆ సినిమా సెట్‌లో తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ‘‘అప్పుడు మొదటిసారిగా నేను పీరియడ్స్‌లో ఉన్నానని ఒక మేల్ డైరెక్టర్‌కు చెప్పాను. ఆయన నా మొదటిరోజా అని అడిగారు. అప్పుడే ఆయన నన్ను చాలా అర్థం చేసుకున్నారని, కేర్ చూపించారని అనిపించింది. ఇది పూర్తి చేసి వెళ్లి రెస్ట్ తీసుకో అన్నారు. ఆ సపోర్ట్ నన్ను చాలా కదిలించింది. మిగతా చోట్ల నాకెప్పుడూ ఇలా జరగలేదు’’ అని తెలిపింది నిత్యా మీనన్.
అందరూ సమానమే
డైరెక్టర్ మిస్కిన్ (Mysskin).. ఆడవారు, మగవారు అందరినీ సమానంగా చూస్తూ, అందరూ కలిసి నడిస్తేనే ఇండస్ట్రీలో మానవత్వం పెరుగుతుందని నమ్మే వ్యక్తి అని తనను ప్రశంసల్లో ముంచేసింది నిత్యా మీనన్. 2020లో మిస్కిన్ దర్శకత్వంలో ‘సైకో’ సినిమాలో నటించిన తర్వాత మరోసారి ఆయన దర్శకత్వంలోనే ‘కాదలిక్క నేరమిల్లై’ (Kadhalikka Neramillai) మూవీని నటించింది నిత్యా. ఈ మూవీ జనవరి 14న విడుదలకు సిద్ధమయ్యింది. ఇందులో నిత్యాకు జోడీగా జయం రవి నటించాడు. యోగి బాబు, వినయ్ రాయ్, జాన్ కొక్కేన్, లాల్.. ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఇంటర్వ్యూలు ఇస్తూ ఇలా ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటోంది.