OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ తో వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ లను మూవీ లవర్స్ ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా వీటిని చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు. ఒక మంచి కిక్ ఉండే క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే మరాఠీ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మొదటినుంచి, చివరివరకూ ట్విస్ట్ లతో నడుస్తుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
నెట్ఫ్లిక్స్ (Netflix)
ఈ క్రైమ్ థ్రిల్లర్ మరాఠీ మూవీ పేరు ‘ఆప్లా మనస్‘ (Aapla Manus). ఈ మూవీకి సతీష్ రాజ్‌వాడే దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి9, 2018 లో వచ్చిన ఈ మరాఠీ మిస్టరీ మూవీని అజయ్ దేవగన్, అభినవ్ శుక్లా నిర్మించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నానా పటేకర్, ఇరావతి హర్షే, సుమీత్ రాఘవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అజయ్ దేవగన్ నిర్మాతగా వ్యవహరించిన మొదటి మరాఠీ మూవీ కూడా ఇదే. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
రాహుల్, భక్తి వీళ్లిద్దరూ భార్య భర్తలు గా ఉంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. రాహుల్ లాయర్ వృత్తిలో ఉండగా,భక్తి లెక్చరర్ గా ఉంటుంది. రాహుల్ తండ్రి అభ వయసు ఎక్కువగా ఉండటంతో ఇంట్లోనే ఉంటాడు. రాహుల్ తన కొడుకుని హాస్టల్లో చదివిస్తూ ఉంటాడు. అయితే తన మనవడిని తనకు దూరం చేశారని, ఎప్పుడూ బాధపడుతుంటాడు అభ. దీనికి కారణం తన కోడలే అని మనసులో అనుమానం పెంచుకుంటాడు. అయితే ఒక రోజు అనుకోకుండా మేడ మీద నుంచి పడి చనిపోతాడు రాహుల్ తండ్రి. ఆ సమయంలో, రాహుల్, భక్తి ఒక టూర్ కి వెళ్లి తిరిగి వస్తారు. వీళ్ళిద్దరూ వచ్చిన తరువాత తండ్రి మేడమీద నుంచి పడి చనిపోతాడు. పోలీసులు ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ కు ఇన్వెస్టిగేషన్ కోసం పంపిస్తారు. మారుతి అనే క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తాడు.
భార్య, భర్తని రకరకాలుగా ప్రశ్నిస్తాడు ఇన్స్పెక్టర్ మారుతి. ఇంట్లో పనిమానిషిని కూడా విచారిస్తాడు మారుతి. అయితే వీళ్ళిద్దరూ తమకు తెలిసిన సమాధానాలు చెప్తూ ఉంటారు. ప్రమాదవశాత్తు పడి చనిపోయాడు అనుకుంటారు. అయితే పోలీసులు మాత్రం ఇది హత్య అని అనుమానిస్తారు. ఇంటి సభ్యులే రాహుల్ తండ్రిని హత్య చేశారని తెలుసుకుంటాడు ఇన్స్పెక్టర్ మారుతి. ఆ సమయంలో కొడుకు, కోడలిమధ్య నలిగిపోయిన రాహుల్ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడా? ఇంటి సభ్యులే ఆత్మహత్యకు ప్రేరేపించారా? రాహుల్ తండ్రిని మేడ మీద నుంచి ఎవరైనా తోసి చంపారా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఆప్లా మనస్’ (Aapla Manus) అనే ఈ మరాఠీ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.