Anil Ravipudi: అనిల్ రావిపూడి(Anil Ravipudi).. ఈ డైరెక్టర్ కి టాలీవుడ్ లో స్పెషల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా ఆయన తీసిన మొదటి సినిమా ‘పటాస్’ నుండి నేడు విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా వరకు ప్రతి చిత్రంలో కూడా తనదైన మార్క్ కంటిన్యూ చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నాడి పట్టుకున్న ఈయన, వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకుండా తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఇక తాజాగా వెంకటేష్ (Venkatesh) హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మళ్లీ పరవాలేదు అనిపించుకున్నారు అనిల్ రావిపూడి. ఈ సందర్భంగా సినిమా బడ్జెట్ గురించి ఈయన చేసిన కామెంట్లు ఆ డైరెక్టర్ ను ఇన్ డైరెక్ట్ గా అన్నట్లు అనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
బడ్జెట్ పై క్లారిటీ..
ముఖ్యంగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాలు.. కళ్ళు చెదిరిపోయే రెమ్యూనరేషన్లు.. ఫారెన్ గ్రాఫిక్స్ అంటూ వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ సినిమా తీస్తున్నారు. అయితే ఇందులో ఎంత శాతం సినిమాలు హిట్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పేరుకే హిట్ అనేలా బాక్స్ ఆఫీస్ వద్ద నంబర్లు అయితే కనిపిస్తున్నా.. నిర్మాతల చేతుల్లోకి డబ్బులు రావడం లేదు. ముఖ్యంగా వందల కోట్ల బడ్జెట్ పెట్టినా.. బ్రేక్ ఈవెన్ కూడా అదే రేంజిలో లేకపోవడమే నిర్మాతలకు భారీ స్థాయి నష్టాన్ని మిగులుస్తోంది. అయితే అనిల్ రావిపూడి దీనికి పూర్తిగా విరుద్ధం. తన సినిమా ఏదైనా సరే హీరో ఎవరైనా సరే బడ్జెట్ లెక్కలు, బౌండరీలు అన్నీ పక్కా ప్లానింగ్ తోనే ఆయన తన సినిమాలో ముందుకు తీసుకెళ్తారు. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలతో ఏ ఒక్క నిర్మాత కూడా నష్టపోలేదు.
శంకర్ ను ఇండైరెక్టుగా టార్గెట్ చేసిన అనిల్..
ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా బడ్జెట్, నిర్మాతలకు వచ్చే లాభాలపై తన అభిప్రాయాన్ని సూటిగా తెలియజేశారు. తాజాగా ఒక మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..” ముందుగా నేను సినిమా చేస్తే.. అందులో అనుకున్న హీరోకి ఇండస్ట్రీ వద్ద ఉన్న మార్కెట్ ఏంటి? ఆ హీరోతో సినిమా చేస్తే బడ్జెట్ ఎంత పెట్టాలి? రిలీజ్ చేసే సమయానికి నిర్మాత ఎంత సేఫ్ లో ఉండాలి? అనేది మాత్రమే చూసుకుంటాను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇదే బిజినెస్ జరుగుతుంది. కేవలం క్రేజ్ ఉంటే సరిపోదు. డబ్బు ఎవరైనా సరే కష్టపడి సంపాదిస్తారు. కాబట్టి వాళ్ల డబ్బుతో నువ్వు గేమ్ ఆడుకోకూడదు. నీ డబ్బు తో నువ్వు ఆడుకోవచ్చు కానీ వేరే వాళ్ళ డబ్బుతో ఆడేటప్పుడు చాలా జాగ్రత్త పడాలి. ఇది నా అభిప్రాయం అందుకే సినిమా బడ్జెట్ ఎప్పుడూ కూడా దాటి నేను సినిమా తీయను. నేను అద్భుతంగా ఖర్చుపెట్టి, మేకింగ్ విజువల్స్ తీయొచ్చు కదా అని అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంది. కానీ అది ప్రాజెక్టుకు సరిపడా మాత్రమే చేస్తాను” అంటూ తెలిపారు అనిల్ రావిపూడి.
నిర్మాతకు భారీ నష్టం మిగిల్చిన శంకర్..
ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. గేమ్ ఛేంజర్ (Game Changer) కోసం దిల్ రాజు (Dil Raju) భారీగా ఖర్చు పెట్టేలా చేసిన డైరెక్టర్ శంకర్ (Shankar) పై నెటిజన్స్ ఇప్పటికే ట్రోల్స్ చేస్తున్నారు. సినిమాలో పాటల కోసమే రూ.75 కట్లు కోర్టు ఖర్చు చేశారు. ఓవరాల్ గా సినిమా బడ్జెట్ రూ.500 కోట్లు. అయితే ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఇవెన్ అవుతుందా? లేదా? అనేది కూడా చెప్పలేకపోతున్నారు. మరోవైపు దిల్ రాజుతో సినిమా చేసిన అనిల్ రావిపూడి లిమిటెడ్ బడ్జెట్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేసి నిర్మాతను సేఫ్ చేశారు. ఇక మొత్తానికైతే అనిల్ రావిపూడి శంకర్ ను ఇండైరెక్టుగా టార్గెట్ చేసే కామెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ సంక్రాంతి బరిలో నిలిచిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రెండు చిత్రాలకి కూడా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.