BigTV English

Jailer 2: జైలర్ 2 అనౌన్స్మెంట్ వచ్చేసిందిరోయ్.. ముత్తువేల్ ఈజ్ బ్యాక్

Jailer 2: జైలర్ 2 అనౌన్స్మెంట్ వచ్చేసిందిరోయ్.. ముత్తువేల్ ఈజ్ బ్యాక్

Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కు  గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. రజినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా జైలర్. ఈ సినిమా  ఎంతోమంది విమర్శకులకు జవాబుగా మారింది. ఎన్నో ఏళ్లుగా రజినీ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో జైలర్ వచ్చింది. ఇంకోపక్క బీస్ట్ సినిమాతో ట్రోలర్స్ కు ఆహారంగా మారిన నెల్సన్ దిలీప్ కుమార్.. ఒక మంచి హిట్ కొట్టి తానేంటో నిరూపించుకోవాలనుకొని ఎంతో కసితో జైలర్ ను తెరకెక్కించాడు.


బీస్ట్ రిజల్ట్ తరువాత నెల్సన్ తో సినిమా చేయొద్దని ఫ్యాన్స్ రజినీని వార్న్ చేశారు. అయినా ఇచ్చినమాట కోసం రజినీ.. ఇవేమి పట్టించుకోకుండా జైలర్ సినిమా చేశాడు. ఎన్నో అంచనాల మధ్య జైలర్ 2023, ఆగస్టు 10 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్నిఅందుకుంది. ముత్తువేల్ పాండ్యన్ గా రజినీ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. తప్పు చేశాడని కన్న కొడుకునే చంపిన తండ్రిగా రజినీకి మంచి మార్కులు పడ్డాయి.

ఇక వీటితో పాటు అనిరుధ్ మ్యూజిక్.. అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆ ఎలివేషన్స్, సాంగ్స్.. తెలుగువారు కూడా జైలర్ కు ఫ్యాన్స్ గా మారిపోయారు. ఇక చివర్లో జైలర్ సీక్వెల్ ఉంటుందని చెప్పి మరింత  ఆసక్తిని క్రియేట్ చేశారు. ఈ సినిమా  తరువాత రజినీకి మళ్లీ ప్లాప్ లే తగిలాయి. దీంతో రజినీ.. జైలర్ సీక్వెల్ కు సిద్దమయ్యాడు. ఎప్పటినుంచో జైలర్ 2 పై  ఎన్నో  రూమర్స్ వస్తున్నాయి. తాజాగా నేడు  సంక్రాంతి కానుకగా మేకర్స్.. జైలర్ 2 అనౌన్స్ మెంట్ టీజర్ ను రిలీజ్ చేసి షాక్ ఇచ్చారు.


Mahavatar Narsimha Teaser: భక్త ప్రహ్లాద జీవిత కథ.. అసలు ఏమన్నా ఉందా టీజర్.. నెక్ట్ లెవెల్ అంతే

ఇక ఈ టీజర్ లో  మ్యూజిక్ డైరెక్టర్  అనిరుధ్, డైరెక్టర్ నెల్సన్.. తమ తదుపరి సినిమా ఏం చేయాలా అని గోవాలో ఒక మసాజ్ సెంటర్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా.. వెనుక నుంచి విలన్స్ లోపలి రావడం, వచ్చినవారిపైకి కత్తులు, తూటాలు దూసుకురావడం  జరుగుతుంది. దీంతో భయపడిన  అనిరుధ్, నెల్సన్ ఒక మూలాన దాక్కున్నారు. ఇక వారిని విలన్స్ ఎటు వెళ్లారు అని రజినీ అడగగా.. గుమ్మం వైపు వేలు చూపిస్తారు. అలా విలన్స్ ను ఫినిష్ చేసిన రజినీ బయటకు రాగా ఇంకో నాలుగు జీపుల నిండా విలన్స్ రావడాన్ని చూపించారు. వెంటనే ఆ జీపులను బాంబ్ లతో  పేల్చేసారు. ఆ మంటల్లో రజినీ ఫేస్ ను రివీల్ చేశారు.

ఇక రజినీని చూసిన అనిరుధ్.. భయంకరంగా ఉంది నెల్సన్.. ఇదే చేస్తే పోలా అని అనడంతో  జైలర్ 2  టైటిల్ పడుతుంది. టీజర్ లో రజినీ ఎలివేషన్స్ పిచ్చెక్కించాయి. జైలర్ టైటిల్ సాంగ్ నే ఈ టీజర్ లో వాడారు. దీన్ని బట్టి  జైలర్ లో కన్నా ఎక్కువ ఎలివేషన్స్  ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఈ సీక్వెల్ తో రజినీ, నెల్సన్  ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×