HBD Namrata:చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు మహేష్ బాబు (Maheshbabu).నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమైన ఈయన…ఇప్పుడు రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రం చేయబోతున్నారు. ఎస్.ఎస్.ఎమ్.బి 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలు, మరొకవైపు బిజినెస్ రంగంలో ఇంత సక్సెస్ఫుల్గా దూసుకుపోవడానికి కారణం ఆయన సతీమణి ప్రముఖ హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ ( Namrata Shirodkar)అని చెప్పవచ్చు. ‘వంశీ’ సినిమా ద్వారా వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ కృష్ణ (Krishna)వీరి పెళ్లిని అంగీకరించకపోవడంతో ముంబైలో రహస్యంగా 2005లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఘట్టమనేని మంజుల (Gattamaneni Manjula)ఎంటర్ అయ్యి తన తండ్రిని ఒప్పించి మళ్ళీ వీరికి వివాహం జరిపించింది. ఇకపోతే వీరి వివాహం సందర్భంగా నమ్రత శిరోద్కర్ కట్నంగా దాదాపు రూ.80 కోట్ల వరకు తీసుకొచ్చిందని సమాచారం. అప్పట్లో ఈ విషయం చాలా హాట్ టాపిక్ గా మారింది కూడా..
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ..
ఇకపోతే 1972 జనవరి 22వ తేదీన జన్మించిన ఈమె ఈరోజు తన 52వ పుట్టినరోజు జరుపుకుంటోంది.ఈ నేపథ్యంలోనే నమ్రతకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నమ్రత తన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత మోడలింగ్ తో కెరియర్ మొదలుపెట్టి, 1993లో మిస్ ఇండియా టైటిల్ ను అందుకుంది. ఆ తర్వాత మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, ఆరవ స్థానంలో నిలిచింది. ఇక 1977లో శత్రుఘ్న సిన్హ ( Shatrughna Sinha ) దర్శకత్వం వహించిన ‘షిరిడీ కే సాయిబాబా’ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తొలిసారి కెరీర్ను ఆరంభించి, 1998లో విడుదలైన ‘జబ్ ప్యార్ కిసీసే సే హోతా హై’ అనే సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఒక్కదాని తర్వాత ఒకటి దాదాపు 16 సినిమాలలో నటించినా..అన్నీ కూడా కమర్షియల్ గా ఫెయిల్ అయ్యాయి.
మహేష్ తో పెళ్లి తర్వాత ఇంటికే పరిమితమైన నమ్రత..
ఇక దాంతో చేసేదేమీ లేక సౌత్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇక్కడ కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. మహేష్ బాబును పెళ్లి చేసుకున్న తర్వాత గౌతమ్( Gattamaneni Gautam ), సితార ( Gattamaneni Sitara ) జన్మించారు. ఇక వీరి కొడుకు గౌతమ్ మహేష్ బాబు నటించిన ‘వన్ నేనొక్కడినే’ అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి, ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. మరొకవైపు సితార సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ భారీ పాపులారిటీ అందుకుంది. అంతేకాదు దిగ్గజ జ్యువెలరీ బ్రాండ్ అయిన పిఎంజే జ్యువెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది.
ఆస్తుల వివరాలు..
నమ్రత మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi ) హీరోగా నటించిన ‘అంజి’ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈమె తెలుగు, మలయాళం, కన్నడ, మరాఠీ, హిందీ భాషల్లో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. వివాహమైన తర్వాత ఇండస్ట్రీని దూరం పెట్టేసి, వ్యక్తిగత జీవితానికే పరిమితమైన నమ్రతా శిరోద్కర్ ఎక్కువగా మహేష్ బాబుకి సంబంధించిన వ్యాపార సామ్రాజ్యం మొత్తం ఈమె చూసుకుంటుంది. ఇక ప్రమోషన్స్, బ్రాండ్ అండార్స్మెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా నమ్రత దగ్గరుండి చూసుకుంటూ ఉండడం గమనార్హం. ఇక దీనికి తోడు అటు మహేష్ బాబుకు తన సినిమాలు, వ్యాపారాల ద్వారా అలాగే తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి సుమారుగా రూ.1200 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.