Deva Teaser: మమూలుగా ఒక హీరోకు లవర్ బాయ్ ఇమేజ్ వచ్చిందంటే.. ఆ తర్వాత దానిని యాక్షన్ హీరో ఇమేజ్‌గా మార్చుకోవడం చాలా కష్టం. అలాగే క్యూట్‌గా కనిపించే హీరోలు యాక్షన్ చేసినా కూడా ప్రేక్షకులకు నచ్చే ఛాన్సులు చాలా తక్కువ. కానీ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ మాత్రం ఎప్పటికప్పుడు ఈ రిస్క్ తీసుకుంటూనే ఉన్నాడు. కెరీర్ మొదటి నుండి సాఫ్ట్ పాత్రలు చేస్తూ అమ్మాయిలకు క్రష్‌గా మారాడు షాహిద్. కానీ మెల్లగా కమర్షియల్ సినిమాలతో తనలోని రఫ్ యాంగిల్‌ను కూడా బయటపెట్టాడు. ఇటీవల ‘కబీర్ సింగ్’తో తన ఇమేజ్‌ను మార్చుకోవాలని చూశాడు. ఇప్పుడు మరోసారి అంతకు మించిన ఉగ్రరూపంలో కనిపిస్తూ అందరికీ షాకిస్తున్నాడు.
రెండేళ్లుగా షూటింగ్
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘కబీర్ సింగ్’లో మొదటిసారి చాలా రఫ్‌గా కనిపించాడు షాహిద్ కపూర్ (Shahid Kapoor). అది కూడా ఒక సౌత్ దర్శకుడిని నమ్ముకొని తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత పెద్ద హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మరొక సౌత్ దర్శకుడిపై షాహిద్ కపూర్ కన్నుపడింది. రోషన్ ఆండ్రూస్ (Rosshan Andrrews) అనే మలయాళ దర్శకుడితో కలిసి ‘దేవ’ అనే సినిమా చేశాడు షాహిద్. ఈ మూవీ జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుండగా తాజాగా దీనికి సంబంధించిన టీజర్ విడుదలయ్యింది. టీజర్ విడుదలయ్యింది.
Also Read: బాలయ్య మూవీకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి ముప్పు.. బాయ్ కాట్ చేస్తామంటూ..?
డైలాగ్స్ లేవు
ఇటీవల విడుదలయిన ‘దేవ’ (Deva) టీజర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేదు. కేవలం షాహిద్ కపూర్ ఉగ్రరూపం మాత్రమే ఉంది. ఇందులో షాహిద్ కపూర్ స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఈ మూవీలో తను పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు కాబట్టి తను క్రిమినల్స్‌తో డీల్ చేసే పద్ధతిని చూపించారు. టీజర్‌లోని తను ఒక జాలి, దయ లేని పోలీస్ ఆఫీసర్ అని ప్రేక్షకులకు ప్రజెంట్ చేశారు దర్శకుడు రోషన్ ఆండ్రూస్. విశాల్ మిశ్రా అందించిన సంగీతం ‘దేవ’ టీజర్‌లో మరో హైలెట్‌గా నిలిచింది. టీజర్ విడుదలయినా కూడా అసలు ఇందులో కథ గురించి ఏ మాత్రం రివీల్ చేయలేదు మేకర్స్. కానీ ఈ మూవీలో సరిపడా యాక్షన్ ఉంటుందని మాత్రం క్లారిటీ ఇచ్చారు.
హిట్ కావాలి
‘దేవ’లో షాహిద్ కపూర్‌కు జోడీగా పూజా హెగ్డే నటించింది. ‘కబీర్ సింగ్’ తర్వాత షాహిద్ కపూర్ నటించిన సినిమాలు ఏవీ మళ్లీ ఆ రేంజ్‌లో హిట్ అవ్వలేదు. అందుకే ఒక రఫ్ పోలీస్ పాత్రలో వచ్చి ప్రేక్షకులను మెప్పించి మళ్లీ ఆ రేంజ్‌లో హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు ఈ బాలీవుడ్ హీరో. అసలైతే ‘దేవ’ మూవీ ఒక మలయాళ చిత్రానికి రీమేక్ అని వార్తలు రాగా ఇది ఒరిజినల్ కథ అని చాలాకాలం క్రితమే క్లారిటీ ఇచ్చాడు షాహిద్ కపూర్. సిద్ధార్థ్ రాయ్ కపూర్, ఉమేష్ కేఆర్ బన్సాల్ కలిసి ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి ముందుకొచ్చారు.