Sankranti Special Train: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలయ్యింది. మరో 10 రోజుల్లో సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే వాళ్లంతా సొంతూళ్లకు బయల్దేరుతున్నారు. వారం రోజుల పాటు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే, ఇంటి ముంగిళ్లు రంగు రంగుల ముగ్గులతో ముస్తబవుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే గంగిరెద్దుల ఆటలు, కోడిపందాలు, హరిదాసు గీతాలతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కోలాహలం ఏర్పడనుంది.
మరో 52 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వే సంస్థ
సంక్రాంతి దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీ పెరుగుతున్నది. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేందుకు ప్రయాణీకులు పెద్ద సంఖ్యలతో తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన అదనపు రైళ్లకు తోడుగా మరో 52 ప్రత్యేక రైళ్లను నడిపించాలని సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని పలు రైల్వే స్టేషన్ల నుంచి ఈ రైళ్లు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు రాకపోకలు కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పోస్టు చేసింది. ఈ అదనపు రైళ్లు ఈ నెల 6 నుంచి 18 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ రైళ్లు సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళం ప్రాంతాలకు నడుస్తాయని తెలిపింది.
సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి నడిచే ప్రత్యేక రైళ్లు
చర్లపల్లి- తిరుపతి (జనవరి 6), తిరుపతి- చర్లపల్లి (జనవరి 7), చర్లపల్లి- తిరుపతి ( జనవరి 8,11,15), తిరుపతి-చర్లపల్లి(జనవరి 9,12,16), వికారాబాద్- కాకినాడ టౌన్ (జనవరి 13), కాకినాడ టౌన్- చర్లపల్లి (జనవరి 14), కాచిగూడ- తిరుపతి (జనవరి 9, 16), తిరుపతి- కాచిగూడ (జనవరి 10, 17), చర్లపల్లి- నర్సాపూర్ (జనవరి 11, 18) నర్సాపూర్- చర్లపల్లి (నవరి 12, 19) మధ్య తమ సర్వీసులను కొనసాగించనున్నాయి.
Read Also: సంక్రాంతికి మరో 60 స్పెషల్ రైళ్లు, సౌత్ సెట్రల్ రైల్వే గుడ్ న్యూస్!
SCR to run Additional Sankranti Special Trains between various Destinations @drmvijayawada @drmgtl @drmgnt pic.twitter.com/fdoNVWdxSq
— South Central Railway (@SCRailwayIndia) January 5, 2025
Read Also: తెలంగాణ నుంచి ఏపీకి స్పెషల్ రైళ్లు.. అన్నీ అక్కడకేనా?
అటు సికింద్రాబాద్- కాకినాడ టౌన్(జనవరి 12,19) కాకినాడ టౌన్- సికింద్రాబాద్(జనవరి 12,19), చర్లపల్లి- నర్సాపూర్ (జనవరి 7,9,13,15,17), నర్సాపూర్- చర్లపల్లి ( జనవరి 8,10,14,16,18), చర్లపల్లి- కాకినాడ టౌన్(జనవరి 8,10,12,14), కాకినాడ టౌన్- చర్లపల్లి( జనవరి 9,11,13,15), నాందెడ్- కాకినాడ టౌన్(జనవరి 6, 13), కాకినాడ టౌన్- నాందెడ్ (జనవరి 7, 14), చర్లపల్లి- శ్రీకాకళం రోడ్ ( జనవరి 9, 12, 14), శ్రీకాకుళం రోడ్- చర్లపల్లి ( జనవరి 10, 13, 15) , కాచిగూడ- శ్రీకాకుళం రోడ్ (జనవరి 7), శ్రీకాకుళం రోడ్- కాచిగూడ(జనవరి 8)తేదీలలో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సంక్రాంతికి మొత్తం 170కి పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. గత సంక్రాంతితో పోల్చితే ఈ ఏడాది రెట్టింపు రైళ్లు నడుపుతున్నట్లు తెలిపారు. అయితే, ఈ ప్రత్యేక రైళ్లలో ఛార్జీలు కాస్త అదనంగా ఉంటాయని వెల్లడించారు.
Read Also: టికెట్లపై 75 శాతం డిస్కౌంట్.. విద్యార్థులకు రైల్వే సంస్థ స్పెషల్ రాయితీల గురించి తెలుసా?