BigTV English

Bollywood: మళ్లీ క్యాన్సర్ బారిన పడ్డ స్టార్ హీరో భార్య.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Bollywood: మళ్లీ క్యాన్సర్ బారిన పడ్డ స్టార్ హీరో భార్య.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Bollywood..బాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానా (Ayushman Khurana) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అయితే ఇప్పుడు గుండె నిండా బాధను మోస్తూ.. మరొకసారి అభిమానులతో తన ఎమోషనల్ పోస్టును పంచుకున్నారు. ముఖ్యంగా తన భార్య మళ్ళీ క్యాన్సర్ భారిన పడిందని, ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. అసలు విషయంలోకి వెళ్తే ఆయుష్మాన్ ఖురానా భార్య తాహిరా కశ్యప్ కి మళ్లీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని, ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది.


మళ్లీ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డ ఆయుష్మాన్ ఖురానా భార్య..

ముందుగా తాహిరా కశ్యప్ తనకొచ్చిన సమస్యను ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేస్తూ.. “నాకు క్యాన్సర్ మళ్ళీ తిరగబడింది. జీవితం నిమ్మకాయలు ఇస్తే, నిమ్మరసం చేసుకోండి అంటూ తాహిరా తన పోస్ట్ కి టైటిల్ పెట్టారు. జీవితం చాలా ఉదారంగా ఉండి మీకు మళ్ళీ నిమ్మకాయలు వస్తే మీరు దానిని శాంతంగా మీ పానీయంలో వేసుకొని పాజిటివ్గా తాగవచ్చు. నాకు రెండో రౌండ్ మొదలయ్యింది. రెగ్యులర్ చెకప్ లు, మామోగ్రామ్ లు చెప్పడానికి వెనుకాడవు. బ్రెస్ట్ క్యాన్సర్ భారిన పడడం బాధగా ఉంది. ఏడు సంవత్సరాల చిరాకు, నొప్పి, రెగ్యులర్ ఎలర్జీ తర్వాత మళ్లీ నా రెండో రౌండ్ మొదలయ్యింది” అంటూ ఆమె ఎమోషనల్ పోస్టు చేయడంతో అభిమానులు ఒక్కసారిగా హార్ట్ బ్రేక్ అయినట్టు ఎమోషనల్ అవుతున్నారు. తాహిరా పోస్టు చూసిన అభిమానులు ఆందోళన చెందుతూ.. ఆమెకు ధైర్యం చెబుతున్నారు. “మీరు మళ్లీ గట్టిగా పోరాడండి.. కచ్చితంగా గెలుస్తారు” అంటూ ధైర్యం చెబుతుంటే.. మరికొంతమంది” చింతించకండి.. మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోండి” అంటూ మరొక యూజర్ సలహా ఇచ్చారు. ఇంకొంతమంది “దేవుడు మిమ్మల్ని త్వరగా మళ్లీ మామూలు మనిషిని చేస్తారు” అంటూ ప్రార్థిస్తున్నారు. ఇకపోతే తాహిరా మళ్లీ ఇలా క్యాన్సర్ బారిన పడడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.


ఈ ప్రమాదం వారిలోనే ఎక్కువ..?

2018లో మొదటిసారి ఈమె బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది. చాలా పోరాటం తర్వాత క్యాన్సర్ ను గెలిచింది. ఇప్పుడు మళ్లీ క్యాన్సర్ బారిన పడడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ క్యాన్సర్ ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అంటే.. చిన్న వయసులో ఉన్న మహిళలు, ప్రత్యేకించి 35 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వారికి రోగ నిర్ధారణ అయితే.. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ అని.. అంతేకాదు మోనోపాజ్ కి ముందు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలిసిన మహిళలకు తిరగబెట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని.. అలాగే పెద్ద బ్రెస్ట్ గడ్డలు ఉన్నా సరే మహిళలకు ఈ ప్రమాదం మళ్ళీ తిరగబడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎక్కువ బరువు, మోనోపాజ్ తరువాత బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని, ధూమపానం కూడా క్యాన్సర్ కారకం అవుతుందని.. కాబట్టి ఈ విషయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకొని వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెబుతున్నారు. తాహిరా త్వరగా కోలుకొని మళ్ళీ మామూలు మనిషి అవ్వాలని కూడా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×