E-Paper
Advertisement

Akhanda 2 Memes: అందుకే బోయపాటిని న్యూ న్యూటన్ ఆఫ్ ఫిజిక్స్ అంటారు

Akhanda 2 Memes: అందుకే బోయపాటిని న్యూ న్యూటన్ ఆఫ్ ఫిజిక్స్ అంటారు

Akhanda 2 Memes: గురుత్వాకర్షణ అనేది ఒక బలం (ఫోర్స్) గాను, అది కేవలం భూమికే పరిమితం కాదనీ, అది విశ్వవ్యాప్తమనీ మొట్టమొదటి సారిగా గుర్తించి, గణితపరంగా సూత్రీకరించినది ఐజాక్ న్యూటన్. సడన్గా న్యూటన్ గురించి ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే సోషల్ మీడియాలో ఇదే టాపిక్ నడుస్తుంది కాబట్టి. ముఖ్యంగా బోయపాటి శ్రీను సినిమాల్లో విలన్లు హీరోలు కొట్టినప్పుడు క్రికెట్ బంతుల్లా బంపులు లేస్తూ ఉంటారు. ఆడియన్స్ కూడా వాటిని ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ సినిమా కథ బలంగా ఉంటే ఏం జరిగినా నడుస్తుంది. కథలో కొద్దిపాటి లోపాలు ఉన్నా కూడా ట్రోల్ చేయడం మొదలుపెడతారు. మాస్ కమర్షియల్ అంశాలను నచ్చే అభిమానులు ఎంతమంది ఉంటారు. వాటిని ట్రోల్ చేసే వాళ్ళు కూడా అదే స్థాయిలో ఉంటారు అనడం వాస్తవం.

https://Twitter.com/BheemlaBoy1/status/1932063924721246447?t=AkQv8DAOEllf3LIzocqx8Q&s=08

అఖండ 2 టీజర్ రెస్పాన్స్ 

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం మీ సినిమాకి సీక్వల్ గా అఖండ 2 వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. బాలకృష్ణ ఫ్యాన్స్ కు ఈ టీజర్ ఒక విజువల్ ట్రీట్ అని చెప్పాలి. మాస్ కమర్షియల్ అంశాలను ఈ టీజర్ లో పొందుపరిచాడు బోయపాటి శ్రీను. ఈ టీజర్ చూస్తుంటే సినిమా మీద నమ్మకాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ తో పాటు ఈ సినిమాకి నెగిటివ్ రెస్పాన్స్ కూడా వస్తుంది. బాలకృష్ణ నుంచి ప్రేక్షకులు కోరుకునే అంశాలు ఈ టీజర్ లో ఉన్నాయి.

నెగిటివ్ కామెంట్స్ 

బోయపాటి శ్రీను సినిమాల్ని ట్రోల్ చేసే ఆడియన్స్ కూడా ఉంటారు. ఇక ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా బోయపాటి శ్రీనును న్యూటన్ తో పోల్చి కొంతమంది ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మరి కొంతమంది చింతాల్ సోప్ యాడ్ కూడా అటాచ్ చేసి ఈ టీజర్ ను ట్రోల్ చేస్తున్నారు. అసాధ్యమైన పనిని కూడా సాధ్యమైనట్లు బోయపాటి చూపిస్తాడు అని ఇప్పటికే కొంతమేరకు కామెంట్స్ వినిపిస్తూ వచ్చాయి. ఇప్పుడు త్రిశూలం సీనుతో అది మరి కాస్త ఎక్కువైపోయింది. మెడ పైన ఉన్న త్రిశూలం మామూలుగా తాకితేనే పడిపోతుంది. అలాంటిది త్రిశూలంతాకి విలన్లు పడిపోవడం మరి అతిగా ఉంది అనేది అనేది కొంతమంది భావన.

Also Read : Akhanda 2 Teaser review : ‘అఖండ 2’ టీజర్‌లో ఇవి గమనించారా? ఫ్యాన్స్‌ ఫ్యూజులు ఎగిరిపోయే డిటైల్స్ ఇవే!

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×