Akhanda 2 Teaser review : ఎవరి టైం ఎప్పుడూ ఎలా మారుతుందో ఎవరు డిసైడ్ చేయలేరు. ఒక టైం లో ఆల్మోస్ట్ నందమూరి బాలకృష్ణ పని అయిపోయింది అనుకున్న తరుణంలో, అఖండ సినిమా వచ్చి వాటన్నిటిని తారుమారు చేసేసింది. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మలుపు ఉన్నట్లే నందమూరి బాలకృష్ణ జీవితంలో అన్ స్థాపబుల్ అనే ఒక మలుపు ఉంది. బాలకృష్ణ హోస్ట్ గా ఒక షో నిర్వహిస్తున్నారు అని అనౌన్స్ చేసినప్పుడు చాలామంది పెదవి విరిచారు. కానీ ఆ షో తో సెలబ్రిటీల యొక్క కొత్త విషయాలు ఎంత మేరకు బయటకు వచ్చాయి అనే విషయాన్ని పక్కన పెడితే, బాలకృష్ణ అసలైన వ్యక్తిత్వం బయటికి వచ్చింది. ఆ వ్యక్తిత్వం చాలా మందికి నచ్చింది. అక్కడి నుంచి బాలకృష్ణను చూసిన విధానం కంప్లీట్ గా మారిపోయింది. ఆ తరుణంలో అఖండ సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ 2. ఈ సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.
అఖండ 2 టీజర్ రివ్యూ
బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా అంటేనే చాలామంది అభిమానులు ఎక్స్పెక్ట్ చేసేది మాస్. అదే తరహాలో బోయపాటి శ్రీను కూడా ముందు సినిమాల్లో బాలకృష్ణను ప్రజెంట్ చేశారు. ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగించారు. కాకపోతే అఖండ సినిమాలని దీనికి కొంచెం డివోషనల్ టచ్ యాడ్ చేశారు. కొన్ని షాట్స్ తో మొదలైన ఈ టీజర్ బాలకృష్ణ “నా శివుడి అనుమతి లేకుండా ఆ యముడైన కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా” అనే డైలాగ్ తో ఒక హై వచ్చింది. ముఖ్యంగా త్రిశూలంతో విధ్వంసం సృష్టించారు. మెడ పైన త్రిశూలం తిరుగుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్న శత్రువులు తలలు తెగిపోవడం ఈ టీజర్ కి హైలెట్. అనని త్రిశూలంతో శత్రువుని మూసుకుని వస్తూ బాలయ్య చెప్పే డైలాగ్స్ గూస్బంస్. ఇలా ప్రేక్షకులకు ఎటువంటి హై సీన్స్ ఉంటే థ్రిల్ ఫీల్ అవుతారు అని బోయపాటి ఎక్స్పెక్ట్ చేసి మరి మాస్ ఇంక్లూడ్ చేశాడు. ఇక ఈ సీన్ కి సంబంధించిన షూటింగ్ అంతా కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే చేశారు. అక్కడ చేసినా కూడా అంత క్వాలిటీ గా కనిపించటం సినిమా మీద మరింత నమ్మకాన్ని కలిగిస్తుంది.
అదే బోయపాటి ప్లస్
ఇక బోయపాటి శ్రీను విషయానికి వస్తే కమర్షియల్ సినిమాని అద్భుతంగా చెబుతాడు. అలానే బోయపాటి సినిమాల్లో కుటుంబ విలువలు కూడా అద్భుతంగా ఉంటాయి. నాన్ బిలీవబుల్ థింగ్స్ ని కూడా బిలీవ్బుల్ గా చూపించడమే బోయపాటి ప్లస్ పాయింట్. అయితే సినిమా హిట్ అయితే వాటన్నిటినీ పెద్దగా పరిగణలోకి తీసుకోరు గానీ ఒకవేళ సినిమా ఫెయిల్ అయితే మాత్రం వాటిని ట్రోల్ చేయడం మొదలు పెడతారు. ముఖ్యంగా బోయపాటి శ్రీను ని చాలామంది పెద్దపెద్ద సైంటిస్టులతో కూడా పోల్చి ట్రోల్ చేస్తారు. ఏదేమైనా ఎప్పటిలానే బాలయ్య ఫ్యాన్స్ కి ఒక విజువల్ ట్రీట్ అయితే రెడీ చేశాడు అని అర్థమవుతుంది.
Also Read: ఆ క్లారిటీ లేకుండా పవన్ మూవీపై ఉదయభాను కామెంట్స్.. దర్శకుడు అసహనం