BigTV English

OTT Movie : రివేంజ్ తీర్చుకోవడానికి అమ్మాయి చేసే అరాచకం… ఓటీటీలో గత్తర లేపుతున్న డెడ్లీ కిల్లర్ యాక్షన్ థ్రిల్లర్

OTT Movie : రివేంజ్ తీర్చుకోవడానికి అమ్మాయి చేసే అరాచకం… ఓటీటీలో గత్తర లేపుతున్న డెడ్లీ కిల్లర్ యాక్షన్ థ్రిల్లర్

OTT Movie : ఒక చిన్న అమ్మాయి, తన కళ్ల ముందే తండ్రిని దారుణంగా చంపిన సీక్రెట్ కల్ట్ సభ్యుల నుండి తప్పించుకుని పారిపోతుంది. చాలా సంవత్సరాల తర్వాత, ఆమె ఒక బ్యాలెరినాగా, అదే సమయంలో రస్కా రోమా అనే అసాసిన్ సంస్థలో శిక్షణ పొందిన డెడ్లీ కిల్లర్‌గా మారుతుంది. ఆమె పేరు ఈవ్ మకారో. తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమె ఒక ప్రమాదకర ఆటను మొదలు పెడుతుంది. కానీ John Wick వంటి లెజెండరీ అసాసిన్‌లు, అండర్‌ వరల్డ్ డాన్ లు ఆమె మార్గంలో అడ్డుపడతారు. మరి ఈవ్ తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుందా ? లేక ఈ హింసాత్మక ప్రపంచంలో ఆమె కూడా ఒక టార్గెట్‌ గా మారుతుందా? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే…

ఈవ్ మకారో ఒక యంగ్ బ్యాలెరినా, రస్కా రోమా అనే రహస్య అసాసిన్ సంస్థలో శిక్షణ పొందుతుంది. గతంలో రస్కా రోమా కికిమోరా (అసాసిన్/బాడీగార్డ్), అతని తన భార్య నడిపే కల్ట్‌ సంస్థను మోసం ఈవ్ తండ్రి జేవియర్ మోసం చేస్తాడు. దీనివల్ల ఈవ్ తల్లి, అక్క చనిపోతారు. జేవియర్ ఈవ్‌ను రక్షించడానికి కల్ట్ సభ్యులతో పోరాడి తీవ్రంగా గాయపడతాడు. న్యూయార్క్ కాంటినెంటల్ హోటల్ యజమాని విన్‌స్టన్ (ఇయాన్ మెక్‌షాన్) ఈవ్‌ను రస్కా రోమాకు తీసుకెళ్తాడు.


అక్కడ డైరెక్టర్ (అంజెలికా హస్టన్) ఆమెను బ్యాలెట్ డాన్సర్, అసాసిన్‌గా తీర్చిదిద్దుతుంది. చాలా సంవత్సరాల తర్వాత, ఈవ్ తన బ్యాలెట్ స్కిల్స్ ను డెడ్లీ ఫైటింగ్ స్టైల్‌గా మలచుకుని, తండ్రి హత్యకు కారణమైన కల్ట్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధపడుతుంది. శిక్షణలో ఉన్నప్పుడు, ఈవ్ జాన్ విక్ (కీను రీవ్స్)ను కలుస్తుంది. అతను ఆమెకు ఈ హింసాత్మక జీవితాన్ని వదిలేయమని సలహా ఇస్తాడు. కానీ ఈవ్ తన టార్గెట్ ను వదలదు. ఆమె మొదటి బాడీగార్డ్ టాస్క్‌లో, హీరెస్ కట్లా పార్క్‌ను రక్షించి, కల్ట్‌కు సంబంధించిన ఒక కీలక క్లూను కనుగొంటుంది.

విన్‌స్టన్, ప్రాగ్ కాంటినెంటల్‌లో డానియల్ పైన్ (నార్మన్ రీడస్) అనే కల్ట్ సభ్యుడు భారీ బౌంటీతో ఉన్నాడని సమాచారం ఇస్తాడు. ఈవ్ ప్రాగ్‌కు వెళ్తుంది. అక్కడ కల్ట్ సభ్యులు, లేనా (గాబ్రియెల్ బైర్న్) నేతృత్వంలో, పైన్‌పై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఈవ్ తన బ్యాలెట్-ఇన్‌స్పైర్డ్ ఫైటింగ్ స్టైల్‌ను ఉపయోగించి, ఫ్లేమ్‌త్రోవర్స్, ఐస్ స్కేట్స్, గన్స్‌తో శత్రువులను ఎదుర్కొంటుంది. కానీ కల్ట్‌తో రస్కా రోమా మధ్య ఒప్పందం ఉందని తెలుస్తుంది. ఇది ఆమె మిషన్‌ను కష్టతరం చేస్తుంది. ఇంతకీ ఆమె తన తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకుందా లేదా? తీర్చుకుంటే ఆ యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంది? మిస్ అవ్వకుండా చూడాల్సిన హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్ ఏంటి? క్లైమాక్స్ ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.

Read Also : అమ్మాయిల స్కామ్ లో ప్రియమణి భర్త … హీటెక్కించే కోర్ట్ రూమ్ డ్రామా

ఏ ఓటీటీలో ఉందంటే?

ఈ దిమ్మతిరిగే యాక్షన్ ఎంటర్టైనర్ పేరు ‘From the World of John Wick: Ballerina’. 2025లో రిలీజ్ అయిన ఈ మూవీ John Wick ఫ్రాంచైజ్‌లో స్పిన్-ఆఫ్. John Wick: Chapter 3 – Parabellum (2019), Chapter 4 (2023) సంఘటనల మధ్య జరుగుతుంది. ఈ మూవీ ప్రస్తుతం Hotstarలో అందుబాటులో ఉంది. ఇందులో ఆనా డి ఆర్మాస్, కీను రీవ్స్, ఇయాన్ మెక్‌షాన్, అంజెలికా హస్టన్, నార్మన్ రీడస్, గాబ్రియెల్ బైర్న్, కాటలినా సాండినో మోరెనో, లాన్స్ రెడ్డిక్ మెయిన్ రోల్స్ పోషించారు. లెన్ వైస్మాన్ దర్శకుడు. లెన్ వైస్మాన్ డైరెక్షన్, ఆనా డి ఆర్మాస్ డైనమిక్ నటన, John Wick యూనివర్స్‌లోని హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్ ఈ చిత్రాన్ని ఒక థ్రిల్లింగ్ రైడ్‌గా మార్చాయి. యాక్షన్ ప్రియులకు ఇదొక సైకలాజికల్, యాక్షన్-ప్యాక్డ్ జర్నీగా నిలుస్తుంది.

Related News

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

Big Stories

×