Buchibabu Sana: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుచ్చిబాబు తండ్రి పెదకాపు నేడు మృతి చెందారు. గతకొంతకాలంగా వయో వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో బుచ్చిబాబు హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు.
తండ్రి మరణంతో బుచ్చిబాబు ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక బుచ్చిబాబు సొంత గ్రామమైన యూ. కొత్తపల్లిలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ అంత్యక్రియల్లో స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా పాల్గొన్నాడు. పెదకాపు మరణవార్త విన్న సుకుమార్.. బుచ్చిబాబు ఇంటికి వెళ్లి.. ఆయన తండ్రికి నివాళులు అర్పించి.. అంత్యక్రియల్లోకూడా బుచ్చిబాబు పక్కనే ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక ఈ విషయం తెలియడంతో పలువురు ప్రముఖులు సైతం బుచ్చిబాబు తండ్రికి సంతాపం తెలుపుతున్నారు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన డైరెక్టర్ బుచ్చిబాబు సానా. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడుగా తెలుగుతెరకు పరిచయమైన బుచ్చిబాబు మొదటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.
ఉప్పెన రికార్డ్ కలక్షన్స్ తో పాటు నేషనల్ అవార్డును కూడా అందుకుంది. ఈ సినిమా తరువాత బుచ్చి.. ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఎన్టీఆర్ తీరిక లేకుండా ఉన్నా కూడా ఆయనతోనే సినిమా చేయాలనీ ఎన్నో ఏళ్ళు ఎదురుచూశాడు. ఇక చివరికి ఎన్టీఆర్..బుచ్చి కథను హోల్డ్ లో పెట్టడంతో.. రామ్ చరణ్ కు మరో కథను వినిపించి ఓకే చేయించుకున్నాడు. RC16 గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాతో బుచ్చి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.