E-Paper
Advertisement

MP Laxman: చరిత్ర హీనులుగా మిగిలిపోతారా? లేక దోషులకు శిక్ష వేస్తారా : ఎంపీ లక్ష్మణ్

MP Laxman: చరిత్ర హీనులుగా మిగిలిపోతారా?  లేక దోషులకు శిక్ష వేస్తారా : ఎంపీ లక్ష్మణ్
Advertisement

MP Laxman Comments On Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోషులకు శిక్ష పడేవరకూ బీజేపీ పోరాటం చేస్తుందని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. చరిత్ర హీనులుగా సీఎం రేవంత్ రెడ్డి మిగిలిపోకూడదంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోషులకు శిక్ష పడేలా చూడాలని అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చూస్తూ ఇందిరా పార్క్ వద్ద శుక్రవారం జరిగిన ధర్నాలో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ కంటే ఎక్కువ పార్లమెంట్ సీట్లను బీజేపీ గెలుస్తుందని అన్నారు. కేసీఆర్ అవినీతిని అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ చాలా సార్లు ప్రస్తావించారని తెలిపారు. ప్రస్తుతం ఏ సమస్యపై ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు.

Advertisement

బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉప ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేయడానికి, ప్రత్యర్థులను దెబ్బకొట్టడానికి ఫోన్ ట్యాపింగ్ వాడిందని తెలిపారు. అరెస్ట్ అయిన వాళ్లు వాంగ్మూలం ఇచ్చినా మిగిలిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. టెలికాం రెగ్యులేటరీ నిబంధనలకు విరుద్ధంగా కేంద్రం అనుమతి లేకుండా కేసీఆర్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ చేసిందని తెలిపారు.

Also Read:  ఫోన్ ట్యాపింగ్‌పై సెంట్రల్ దృష్టి, డీటేల్స్ కావాలంటూ…

Advertisement

బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్‌పై  కేసీఆర్ అక్రమ కేసులు పెట్టించారని  ఆరోపించారు. లిక్కర్ కేసు నుంచి కవితను తప్పించడం కోసం బీజేపీ నేతలపై కేసులు పెట్టడం దర్మార్గం అని అన్నారు. అంతే కాకుండా బీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడిందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులకు శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు.

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×