BigTV English

Water Crisis in Delhi: ఢిల్లీలో నీటి సంక్షోభం, చేతులు జోడించి సీఎం అభ్యర్థన, ఆపై కోర్టుకు

Water Crisis in Delhi: ఢిల్లీలో నీటి సంక్షోభం, చేతులు జోడించి సీఎం అభ్యర్థన, ఆపై కోర్టుకు

Water Crisis in Delhi: నీటి కోసం యుద్ధాలు మొదలవుతున్నాయా? భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు తప్పవని చాలా మంది మేధావులు చెప్పారు. ఇప్పటికే ఆఫ్రికాను వాటర్ క్రైసిస్ వెంటాడుతోంది. ఇదంతా ఇప్పట్లో కాదని దేశంలోని పలు ప్రభుత్వాలు లైట్‌గా తీసుకున్నాయి. మేధావులు చేసిన హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదు. దాని ఫలితమే.. నిన్న కోల్‌కత్తా, బెంగళూరు.. నేడు ఢిల్లీ.


ఉత్తరాదిలో ఈసారి ఎండలు ఠాకెత్తించాయి. ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 45 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది. రోడ్డు మీదకు ప్రజల రాలేక నానావస్థలు పడ్డారు. ఎండల ప్రభావం నీటిపై పడింది. దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరత తీవ్రమైంది.

వీధుల్లోకి వాటర్ ట్యాంకులు వస్తే చాలు నీటి చుక్కను ఒడిసి పట్టుకోవడానికి నానాప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో ప్రజలు కొట్టుకుంటున్న సందర్భాలు లేక పోలేదు. ప్రస్తుతం ఢిల్లీ అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. పరిస్థితి గమనించిన ఆప్ సర్కార్, నీటి వృధాను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది.


ముఖ్యంగా వాహనాలు కడిగితే భారీ మొత్తం జరిమానా వేసేందుకు వెనుకాడలేదు. నీటిని వాణిజ్యం కోసం ఉపయోగించే ఊరుకునేది లేదని హెచ్చరించింది. ముఖ్యంగా నిర్మాణాలు జరిగే ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలు వంటి ప్రాంతాల్లో అక్రమంగా ఉన్న నీటి కనెక్షన్లను నిలిపివేయాలని ఢిల్లీ మంత్రి అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రత కారణంగా ఢిల్లీకి హర్యానా నుంచి రావాల్సిన నీటి సరఫరా ఆగిపోవడంతో ఈ సమస్య తలెత్తిందని అధికారులు చెబుతున్నమాట.

ఢిల్లీలో తలెత్తిన నీటి సంక్షోభంపై కేజ్రీవాల్ సర్కార్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. హర్యానా, యూపీ ప్రభుత్వాలు తమకు అదనపు నీళ్లు కేటాయించేలా ఆదేశాలివ్వాలని అందులో ప్రస్తావించింది. మరోవైపు ప్రస్తుత పరిస్థితిపై సీఎం కేజ్రీవాల్ రియార్ట్ అయ్యారు. ఎండల కారణంగా ఢిల్లీలో విద్యుత్ వినియోగం పెరిగిందని, అయినా ఎక్కడా కొరత లేదన్నారు. అధిక ఎండల కారణంగా నిటి వినియోగం పెరిగింది.

ALSO READ: గోల్డ్ స్మగ్లర్లు కొత్త ఎత్తులు, బుక్కైన ఎయిర్‌హోస్టెస్, బంగారాన్ని…

సరిహద్దు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి సరఫరా తగ్గిపోయింది. దీనిపై అందరూ కలిసి నీటి సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపు ఇచ్చారు. రాజకీయాలు పక్కనబెట్టి నీటి సమస్య నుంచి ఢిల్లీ ప్రజలకు ఉపశమనం కలిగించాలని చేతులు జోడించి కోరారు. అందరం కలిసి పనిచేస్తే హస్తిన వాసుల కష్టాలు తగ్గుతాయని పేర్కొన్నారు. గత ఏప్రిల్ నెలలో బెంగుళూరు, కోల్‌కత్తాలో ఇదే పరిస్థితి నెలకొంది. కాస్త వర్షాలు పడడంతో కొంత ఉపశమనం కలిగింది.

 

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×