BigTV English

Kartikeya-3: అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్.. ఈ సారి అంతకుమించి..!

Kartikeya-3: అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్.. ఈ సారి అంతకుమించి..!

Kartikeya-3: ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు తండేల్ సినిమా (Thandel Movie) పైనే ఎక్కువ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘తండేల్’ సినిమా గురించి ప్రమోషన్స్ లో పాల్గొంటున్న చిత్ర యూనిట్ మొత్తం ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా బయట పెట్టడంతో సినిమా చూడడానికి అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ మూవీ డైరెక్టర్ చందు మొండేటి (Chandu Mondeti) ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ‘కార్తికేయ-3’ అప్డేట్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. అయితే ఈ ప్రశ్నకు చందు మొండేటి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. మరి కార్తికేయ-3 (Karthikeya-3) ఎప్పుడు ఉండబోతుంది అనేది డైరెక్టర్ మాటల్లోనే చూద్దాం..


కార్తికేయతో భారీ సక్సెస్..

నిఖిల్ (Nikhil) హీరోగా వచ్చిన కార్తికేయ (Karthikeya) మూవీ సుబ్రమణ్యేశ్వర స్వామి బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. ఆ తర్వాత చందు మొండేటి, కార్తికేయ మూవీకి సీక్వెల్ గా కార్తికేయ-2 (Karthikeya-2) అనే మూవీ అనౌన్స్ చేసి శ్రీకృష్ణుని బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాతో చిన్న హీరో అయినటువంటి నిఖిల్ పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. అలాగే చందు మొండేటికి కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అనే హోదా వచ్చింది.


కార్తికేయ 3పై బిగ్ అప్డేట్..

అలా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తికేయ 2 భారీ హిట్ కొట్టడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ -3 కూడా ఉంటుందని అప్పుడే అనౌన్స్ చేశారు. అయితే తాజాగా ప్రమోషన్స్ లో కార్తికేయ -3గురించి అప్డేట్ ఇచ్చారు చందు మొండేటి.ఆయన మాట్లాడుతూ.. కార్తికేయ -3(Karthikeya-3) కోసం నా దగ్గర ఓ అద్భుతమైన అప్డేట్ ఉంది. ఇప్పటికే కార్తికేయ -3 మూవీ కోసం చాలా అద్భుతమైన కాన్సెప్ట్ నా మైండ్ లో ఉంది.ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకి తీసుకు వెళ్తాను. తండేల్ మూవీ విడుదలై రిజల్ట్ వచ్చాక కార్తికేయ-3 పై నా పూర్తి ఫోకస్ పెడతాను. ఇక ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే విధంగా అద్భుతంగా తెరకెక్కించాలి అనుకుంటున్నాను. అందుకే కార్తికేయ-3 కోసం ఇప్పటికే లొకేషన్ వేట కూడా పూర్తయింది. నేను ఎన్నో రోజుల నుండి శ్రీకృష్ణుని గురించి చెప్పాలి అనుకుంటున్నాను.అలా కార్తికేయ టు ద్వారా కొంతవరకు చెప్పగలిగాను. ఈ సినిమా చూశాక చాలామంది పిల్లలు గోవర్ధనగిరి గురించి, శ్రీకృష్ణుని గురించి తమ తల్లిదండ్రులను అడుగుతున్నారని నాకు తెలిసింది.కార్తికేయ-2 ద్వారా ఆ కృష్ణ భగవానుడు నాకు ఒక మంచి లైఫ్ ఇచ్చాడు.

ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను..

అందుకు ఆయనకు నేను ఎప్పటికీ కృతజ్ఞతుడిని. ఇదే భక్తి భావంతో కార్తికేయ -3 (Karthikeya -3) మూవీని కూడా చేస్తాను. కార్తికేయ -3 మూవీ కూడా పూర్తిగా ఆ శ్రీకృష్ణుడి చుట్టే తిరుగుతుంది. కేవలం ఇదే కాదు మన పురాణాలు, సాంస్కృతులు, మూలాల గురించి ఇంకా ఎంతో సమాచారాన్ని సినిమాల ద్వారా ప్రేక్షకులకు తెలియజేయాలి అనుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు మరెన్నో తెరకెక్కుతాయి. ఇప్పటికే నేను శ్రీకృష్ణుడి గురించి పూర్తిగా తెలుసుకునే పనిలో పడ్డాను” అంటూ డైరెక్టర్ చందు మొండేటి కార్తికేయ-3 మూవీ గురించి ఒక మంచి అప్డేట్ ఇచ్చారు. ఇక డైరెక్టర్ ఇచ్చిన అప్డేట్ తో అభిమానుల్లో కొత్త జోష్ నెలకొంది. ఇక తండేల్ సినిమా రిజల్ట్ తర్వాత డైరెక్టర్ కార్తికేయ -3 తీయబోతున్నారని అప్డేట్ ఇవ్వడంతో ఆ సినిమా లో ఇంకెన్ని అద్భుతాలు చూస్తామో అని ఫ్యాన్స్ లో ఒక ఆతృత మొదలైంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×