BigTV English

Udit Narayan : లైవ్ లో ఇవేం పాడు పనులు… లేడీ ఫ్యాన్ కు లిప్ లాక్ ఇస్తూ రెచ్చిపోయిన సీనియర్ సింగర్

Udit Narayan : లైవ్ లో ఇవేం పాడు పనులు… లేడీ ఫ్యాన్ కు లిప్ లాక్ ఇస్తూ రెచ్చిపోయిన సీనియర్ సింగర్

Udit Narayan : పాపులర్ బాలీవుడ్ సీనియర్ సింగర్ ఉదిత్ నారాయణ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆయన లైవ్ కాన్సర్ట్ లో ఓ మహిళా అభిమానికి లిప్ లాక్ ఇచ్చిన వీడియో తెగ వైరల్ అవుతుంది. దీంతో ఆ వీడియోని చూసిన వాళ్ళు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.


వివాదం ఏంటంటే?

ఉదిత్ నారాయన్ దేశంలోనే అత్యంత పాపులర్ సింగర్స్ లో ఒకరు. 90వ దశకంలో ఆయన విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఉదిత్ ఖాతాలో ఎన్నో ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఉన్నాయి. ఇక ఈ సీనియర్ సింగర్ వివిధ దేశాల్లో లైవ్ కాన్సర్ట్ ఇస్తూ సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా ఇలాంటి ఒక మ్యూజిక్ కాన్సర్ట్ జరగగా , అందరూ ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఆసక్తిని కనబరిచారు.


ఉదిత్ నారాయన్ స్టేజ్ పై ‘టిప్ టిప్ బర్సా పానీ’ అనే పాపులర్ పాటను పాడుతూ, మరోవైపు లైన్లో తనతో సెల్ఫీ దిగడానికి వెయిట్ చేస్తున్న మహిళలతో ఫోటోలు దిగడానికి ఆసక్తిని కనబరిచారు. మొత్తానికి అమ్మాయిలందరూ వరుసగా వస్తుండగా, ఉదిత్ నారాయన్ పాట పాడుతూనే ఒక్కొక్కరి తో సెల్ఫీ దిగి, ఆ తర్వాత బుగ్గపై ముద్దు పెడుతూ కనిపించారు. ఇలా ఒక్కరు ఇద్దరు కాదు, ఎంతమంది వస్తే అంతమందితో అలాగే నడుచుకున్నారు.

లేడి ఫ్యాన్ తో అసభ్యకరంగా..

ఈ క్రమంలోనే మరో లేడీ ఫ్యాన్ సెల్ఫీ కోసం ఆయన దగ్గరకు వెళ్ళగా, ఉదిత్ లిప్స్ పై ముద్దు పెడుతూ కనిపించాడు. నిజానికి ఆమె అతను బుగ్గపై ముద్దు పెడతాడు అనుకుంది. కానీ ఉదిత్ ఊహించని విధంగా ఆమెకు లిప్ లాక్ ఇవ్వడంతో షాక్ అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, ఆయనపై మండిపడుతున్నారు నెటిజన్లు. ఆ వీడియోని చూసి షాక్ అయిన వారు ట్రోలింగ్ తో ఈ సీనియర్ సింగర్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు.

ఉదిత్ పై ట్రోలింగ్…

ఇక ఇటీవల కాలంలో ఇలాంటి ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉదిత్ నారాయన్ విషయంలో వైరల్ అవుతున్న వీడియో కూడా ఏఐ అయితే బాగుండునని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు. మరోవైపు వర్గం ప్రేక్షకులు ఆయన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇలా లైవ్ లో స్టేజ్ పై అమ్మాయిలకి లిప్ లాక్ ఇస్తూ ఆయన సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు అంటూ మండిపడుతున్నారు.

గతంలో కూడా ఇలాగే… 

గతంలో ఆల్కా యాగ్నిక్, శ్రేయా ఘోషల్ వంటి లేడి సింగర్స్ చెంపపై ముద్దుపెట్టి, ఉదిత్ ఆశ్చర్యానికి గురిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ స్టార్ సింగర్ నాలుగు జాతీయ అవార్డుల గ్రహీత మాత్రమే కాదు. 2009లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్‌ కూడా అందుకున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×