SSMB 29 Update: సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu ) హీరోగా, దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఎస్.ఎస్.ఎం.బి 29 (SSMB 29). ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కీలకపాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) విలన్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) కథను అందించారని తెలియడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి వచ్చిన ఒక అప్డేట్ గూస్ బంప్స్ తెప్పిస్తోందని చెప్పాలి. అసలు విషయంలోకి వెళితే, ఈ సినిమా కోసం ఒక స్టార్ డైరెక్టర్ ను రాజమౌళి తనకు సహాయంగా రంగంలోకి దింపారట.
రాజమౌళికి తోడుగా మరో స్టార్ డైరెక్టర్..
అసలు విషయంలోకి వెళితే, ఈ సినిమా కోసం ఒక స్టార్ డైరెక్టర్ ను రాజమౌళి తనకు సహాయంగా రంగంలోకి దింపారట. ఆయన ఎవరో కాదు డైరెక్టర్ దేవ కట్టా (Deva katta). ఈ సినిమాకు డైలాగ్ రైటర్ గా దేవ కట్టా పనిచేయబోతున్నట్లు సమాచారం . ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. వాస్తవానికి దేవ కట్టా డైలాగ్స్ ఎంత బాగా అందిస్తారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాంటి ఈయన ఇప్పుడు ఎస్.ఎస్.ఎమ్.బి.29 కోసం రంగంలోకి దిగడంతో ఇక ఎంత పగడ్బందీగా డైలాగ్స్ తయారు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా రాజమౌళి ఈ సినిమా కోసం చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
డైరెక్టర్ దేవ కట్టా సినిమాలు..
డైరెక్టర్ దేవా కట్ట ఆంధ్ర ప్రదేశ్ ఏలూరుకు చెందినవారు. 2005లో ‘వెన్నెల’ అనే సినిమా ద్వారా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఈయన.. ఆ తర్వాత 2010లో ‘ ప్రస్థానం’, 2014లో ‘ఆటోనగర్ సూర్య’, 2021లో ‘రిపబ్లిక్’ వంటి క్లాసిక్ తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక ప్రస్థానం అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించబడింది. అంతేకాదు 2010లో ఈ సినిమా ఫిలిం సౌత్ క్రిటిక్స్ అవార్డు ఫర్ బెస్ట్ ఫిల్మ్ తో పాటు నంది అవార్డు ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం తో సహా రెండు ఫిలింఫేర్ అవార్డులను అందుకుంది. దేవ దర్శకుడు మాత్రమే కాదు డైలాగ్ రైటర్ కూడా.. ప్రస్తుతం ఈయన ‘మాయాసభ : సీజన్ వన్’ అనే వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రానికి డైలాగ్ రైటర్, నిర్మాత కూడా ఈయనే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇక ఈయన సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు ఒక షార్ట్ ఫిలిం కూడా నిర్మించారు. 2015లో ‘నేనే అయిపోతున్నాను’ అనే షార్ట్ ఫిలిం కి దర్శకత్వం వహించారు. అంతే కాదు నటుడిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. 2013లో వచ్చిన’ డి ఫర్ దోపిడీ’ సినిమాలు ఏసిపి కృష్ణమాచారిగా పనిచేసి మెప్పించారు.