Mangao Man: సమ్మర్ సీజన్ ప్రారంభం కాగానే రకరకాల పళ్లు నోరు ఊరిస్తుంటాయి. కేవలం సమ్మర్‌లో మాత్రమే వాటికి ఛాన్స్ ఆ ఉంటుంది. అందులో ఒకటి మామిడి పండ్లు. పేరుకు మామిడే అయినా వాటికి సంబంధించి రకరకాల జాతుల పళ్లు హంగామా చేస్తుంటాయి. ఇండియాలో ‘మ్యాంగో మ్యాన్’గా పేరు గడించిన కలీం ఉల్లాఖాన్ గురించి తెలుసా? మామిడికి ఆయనకు లింకేటి అనుకుంటున్నారా? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
జీవితంలో తమకంటూ గుర్తింపు కావాలని కోరుకునే వాళ్లు ఎక్కువ మంది ఉంటారు. అందులోనూ సోషల్‌మీడియా ప్రబలంగా ఉన్న ఈ రోజుల్లో ఆ కోరిక మరింత ఎక్కువ. కొందరు అవేవీ పట్టించుకోకుండానే సాదాసీదా జీవితాన్ని గడుపుతారు. అదృష్టం కూడా వారికి వెతుక్కుంటూ వస్తుంది. అందుకు కలీం ఉల్లాఖాన్ ప్రత్యక్ష ఉదాహరణ. కేవలం ఒక్క చెట్టుకు 300 మామిడి రకాలకు క్రియేట్ చేశాడు. అందుకే ఆయన ఇండియా మ్యాంగ్ మేన్ అయ్యారు.
కలీం ఉల్లాఖాన్ నేపథ్యం
ఉత్తరప్రదేశ్‌కు చెందిన కలీం ఉల్లాఖాన్ సొంతూరు మలిహాబాద్. ఆయన పరిశోధకుడు కాదు.. మామూలుగా మనిషి. ఆయన హార్టికల్చర్ అంటే మహా ఇష్టం. అదే ఆయన్ని ఇండియా మ్యాంగో మ్యాన్‌గా తయారు చేసింది. ఆయన చదివింది కేవలం ఏడో తరగతి మాత్రమే. హైస్కూల్ విద్యను పూర్తిగా ఆస్వాదించలేదు. తండితో కలిసి ఉద్యానవనం రంగంలో అడుగులు వేయడం మొదలుపెట్టారు.
17 ఏళ్లకే ప్రయోగాలు
తన జీవితాన్ని నర్సరీని కరెక్ట్ అని ఎంచుకున్నారు. తండ్రితో కలిసి వారి నర్సరీలో పని చేయడం మొదలుపెట్టాడు. 17 సంవత్సరాల వయస్సులో ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. 120 ఏళ్ల నాటి మామిడిచెట్టుతో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. ఏ పని చేసినా తొలుత చేదు అనుభవాలు ఎదురవుతాయి. కలీం విషయంలోనూ అదే జరిగింది.
ALSO READ: దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరిగే ప్రమాదం, నిఘా వర్గాల హెచ్చరిక
చిన్న చిన్న సమస్య కారణంగా కలీం చేసిన మొదటి ప్రయోగం విఫలమైంది. ఐనప్పటికీ తన ప్రయోగాలను మాత్రం ఆపలేదు. మరో ప్రయోగం మొదలుపెట్టాడు.. ఆ తర్వాత అది సక్సెస్ అయ్యింది. ఒక చెట్టుపై ఏడు రకాల మామిడి పండ్లను క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. ప్రతీ కొమ్మకు కొత్తగా అంటు కట్టడం మొదలుపెట్టారు. అలా ఒక మ్యాంగో చెట్టుకు 300 రకాల మామిడి పండ్లను తయారు చేశారు.
సెలబెట్రీల పేర్లు
భారతదేశంలో అనేక ప్రసిద్ధ మామిడి రకాలు ఉన్నాయి. తోతాపురి, దసహ్రీ, లాంగ్రా, చౌసా వంటి రకాలను తీసుకొచ్చి అంటు కట్టడం మొదలుపెట్టారు. క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్, 1994లో మిస్ వరల్డ్ ఐశ్వర్య, ఆ తర్వాత అనార్కలి, నరేంద్రమోదీ రకరకాల పేర్లు పెట్టారు. వచ్చే ప్రతీ మామిడి పండు రంగు, రుచి కూడా వెరైటీగా ఉంటుంది. అందుకే ఈ రంగంలో ఆయన నిపుణుడు అయ్యారు.
మామిడి చెట్లకు వినూత్నంగా అంటు కట్టడం పద్ధతి మొదలయ్యాయి. ఉద్యానవన సాగుకు ఆయన చేసిన ప్రత్యేక కృషిని భారత ప్రభుత్వం గుర్తించింది. 2008లో ఆయనకు పద్మశ్రీ అవార్డు వరించింది. ఆనాటి నుంచి ఆయన ఇండియా మ్యాంగో మెన్‌గా మారిపోయారు. కలీం @ 300 ఇదన్నమాట. కలీం గురించి కేవలం ఇండియా పత్రికలు మాత్రమే కాదు.. విదేశీ పత్రికలు సైతం ఆయన గురించి రాసుకొచ్చాయి. పట్టుదల ఉండేలాగానీ ఏ రంగంలోనైనా సాధించవచ్చు.