Preity Zinta on SRH : సాధారణంగా హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రతీ చోటా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ లో కూడా వేలాది మంది భక్త జన సందోహం మధ్య హన్ మాన్ శోభయాత్ర కన్నుల పండువగా సాగింది. ఈ నేపథ్యంలో గౌలిగూడ నుంచి తాడ్ బండ్ హనుమాన్ ఆలయం వరకు శోభయాత్ర జరిగింది. ఇదిలా ఉంటే.. హన్ మాన్ జయంతి సందర్భంగా పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా తాడ్ బండ్ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. తాడ్ బండ్ హనుమాన్ ఆలయానికి శనివారం ఉదయమే వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంజాబ్ కింగ్స్ విజయాన్ని కోరుతూ ప్రీతి జింటా వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నారు.
ప్రీతి జింటా వీరాంజనేయ స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. అయితే ఫలితం మాత్రం హైదరాబాద్ కు పాజిటివ్ గా వచ్చింది.. ప్రీతి జింటా పూజలు ఫలించలేదు. ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడింది. ఈ మ్యాచ్ లో తొలుత పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. ప్రియాంశ్ ఆర్య 36, ప్రభుసిమ్రాన్ 42, శ్రేయాస్ అయ్యర్ 82, నెహాల్ వదేరా 27, స్టోయినీస్ 34 పరుగులు చేశారు. దీంతో పంజాబ్ కింగ్స్ 245 పరుగులు చేసింది. 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్లు ట్రావీస్ హెడ్ 66 పరుగులు చేయగా.. అభిషేక్ 55 బంతుల్లో 141 పరుగులతో మెరుపులు మెరిపించాడు. అందులో 10 సిక్స్ లు 14 ఫోర్లు ఉండటం విశేషం. క్లాసెన్ 21, ఇషాన్ కిషన్ 9 పరుగులు చేశారు.
పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే.. గత మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ని ఓడించింది ఈ టీమ్. తొలుత బ్యాటింగ్ ఎంచుకొని చెన్నై ని ఓడించిన మాదిరిగానే హైదరాబాద్ ను ఓడించవచ్చని భావించింది. కానీ హైదరాబాద్ జట్టు చరిత్ర తిరగరాసింది. ఈ నేపథ్యంలోనే ఆ టీమ్ కో ఓనర్ ప్రీతి జింటా తాడ్ హనుమాన్ దేవాలయాన్ని సందర్శించడం.. ఆంజనేయుడి ఆశీస్సులు తీసుకోవడం.. మ్యాచ్ ఓడిపోవడంతో ట్రోలింగ్స్ చేయడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. హనుమాన్ జయంతి నేపథ్యంలో ఆమె టెంపుల్ కి వచ్చినా.. ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈసారైనా అది దక్కేలా చేయమంటూ ఆంజనేయస్వామిని కోరుకున్నట్టు సమాచారం.
హనుమాన్ జయంతి రోజు హైదరాబాద్ జట్టుకు మంచి అనుకూలంగా అనిపించింది. హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ కు బంతులు వేయాలంటే పంజాబ్ కింగ్స్ బౌలర్లు భయపడ్డారు. ఏ బంతి వేసినా ఫోర్ లేదా సిక్స్ గా మలుచుతున్నాడు. చివరికీ అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ లో యార్కర్ బాల్ కి అభిషేక్ శర్మ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఓపెనర్లు ఇద్దరూ దాదాపు 175 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చూసి అందరూ ఈ మ్యాచ్ సన్ రైజర్స్ ఛేదించలేరని భావించారు. కానీ హైదరాబాద్ ఓపెనర్ల ఆట తీరు చూసి 10 ఓవర్లలోనే విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ కి అభిమానులు ఫిదా అయ్యారు.