Gautam Menon: ‘ ఏ మాయ చేసావే’ సినిమా డైరెక్టర్ అనగానే.. అందరికీ టక్కున గౌతమ్ మీనన్(Gautham Menon)పేరు గుర్తుకొస్తుంది. ఈ సినిమాతో ఆయన సౌత్ ఇండస్ట్రీలో ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్నారో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా కంటే ముందే ఈయన తమిళంలో తీసిన వరుస సినిమాలు హిట్ అయినప్పటికీ ఏ మాయ చేసావే సినిమా మాత్రం ఈయనకు భారీ హిట్ ని ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. గౌతమ్ మీనన్ పేరు.. ఈ సినిమాకి దర్శకత్వం వహించాక ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ఈ సినిమా సమయంలోనే సమంత(Samantha), నాగచైతన్య (Naga Chaitanya)లు కూడా ప్రేమలో పడ్డారు. అలా వీరు ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడానికి ఈ సినిమా కారణమైంది.
చనిపోవాలనుకున్నా..
ఇక వీరి విషయం పక్కన పెడితే.. దర్శకుడు గౌతమ్ మీనన్ ఇప్పుడు ఎక్కువగా సినిమాలు తీయడం లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన నేను చనిపోయేవాడిని, బ్రతికించారు అంటూ సంచలన కామెంట్లు చేశారు. మరి ఇంతకీ గౌతమ్ మీనన్ కు వచ్చిన కష్టం ఏంటి? ఆయన ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం.. గౌతమ్ మీనన్ మొదట ‘మిన్నలే’ అనే సినిమా ద్వారా తమిళ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడంతో పాటు ఇందులోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ ఆదుకోలేదు..
దాంతో డైరెక్టర్ గా గౌతమ్ మీనన్ కి గుర్తింపు లభించింది.ఆ తర్వాత ఈయన తమిళంలో చెప్పుకోదగ్గ సినిమాలు చేశాడు. అలా గౌతమ్ మీనన్ కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు. ముఖ్యంగా కనులు కనులను దోచాయంటే, లియో, మైకేల్, రత్నం వంటి సినిమాల్లో కూడా నటించారు. అయితే అలాంటి డైరెక్టర్ గౌతమ్ మీనన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేశారు.ఆయన మాట్లాడుతూ.. ఈ విషయాన్ని నేను ఇప్పుడు చెప్పడానికి చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీలో నాకు సహాయం చేయడానికి ఒక్కరు కూడా లేరు. ఈ విషయం వినడానికి ఇబ్బందిగా అనిపిస్తున్నా కూడా ఇదే నిజం. ఇండస్ట్రీలో నాకు ఒక్కరు కూడా సపోర్ట్ ఇవ్వలేదు. ఎందుకంటే నేను డైరెక్షన్ చేసిన ధ్రువ నక్షత్రం సినిమా ఇబ్బందుల్లో ఉంటే కనీసం ఇండస్ట్రీ నుండి ఒక్కరు కూడా స్పందించలేదు. నా సినిమా విడుదల కోసం నాకు సహాయం చేయలేదు. కేవలం ఇండస్ట్రీలోని డైరెక్టర్ లింగస్వామి, ధనుష్ ఇద్దరు మాత్రమే నా సినిమా విడుదల కోసం కొన్ని స్టూడియో ఛానల్స్ వాళ్ళకి చూపించి, సినిమా రిలీజ్ అయ్యేలా సపోర్ట్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల కాలేదు. ఎందుకంటే ఆ సినిమాలో కొన్ని సమస్యలు ఉండడం వల్ల ధ్రువ నక్షత్రం సినిమాని రిలీజ్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ నా సినిమా ధ్రువ నక్షత్రం చూడ్డానికి ఇప్పటికి కూడా ప్రేక్షకులు ఆసక్తిగానే ఉన్నారు. నా సినిమాలు చూడడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. కాబట్టే నేను ఇంకా బ్రతికి ఉన్నాను అంటూ తన సినిమాలను ఆదరించే ప్రేక్షకుల గురించి గొప్పగా చెప్పారు డైరెక్టర్ గౌతమ్ మీనన్. ఇక గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ధ్రువ నక్షత్రం సినిమా 2016 లో సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది.
వారే నన్ను బ్రతికించారు..
కానీ ఈ సినిమా ఇప్పటికి కూడా విడుదలకు నోచుకోలేదు. అయితే ధ్రువ నక్షత్రం సినిమా అప్పుడు విడుదలవుతుంది ఇప్పుడు విడుదలవుతుంది అంటూ చాలా సార్లు పోస్టర్స్ రిలీజ్ చేశారు. కానీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ప్రతిసారి ఆ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. దాంతో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తనకు ఎవరు సపోర్ట్ చేయలేదు అనే ఉద్దేశంతో ఇండస్ట్రీ వారిపై గౌతమ్ మినన్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.ఇండస్ట్రీ వాళ్ళు పట్టించుకోకపోయినా ప్రేక్షకులు మాత్రం నాకు తోడునీడగా ఉన్నారని ప్రేక్షకులను దేవుళ్ళుగా భావించి నేను బ్రతికుండడానికి వాళ్లే కారణం అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారడంతో చాలామంది ఈయన మాట్లాడిన విషయం గురించి చర్చించుకుంటున్నారు. ఇండస్ట్రీకి చెందిన పేరున్న డైరెక్టర్ సినిమా ఇబ్బందుల్లో పడితేనే పట్టించుకోలేదు. అలాంటిది సినిమాల్లోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కొత్తగా వచ్చే నటీనటులకు,డైరెక్టర్లకు ఇంకెన్ని ఇబ్బందులు ఉంటాయో అంటూ కామెంట్స్ పెడుతున్నారు.