BigTV English

Sreeleela: శ్రీలీల మామూల్ది కాదు పెద్ద ముదురే… షాకింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్!

Sreeleela: శ్రీలీల మామూల్ది కాదు పెద్ద ముదురే… షాకింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్!

Sreeleela: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న వారిలో యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sreeleela)ఒకరు. ఈమె శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందD అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొదటి సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకో లేకపోయినా ఈమె తన నటన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత శ్రీ లీలకు తెలుగులో పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చాయి. తదుపరి నటించిన సినిమాలలో ఒకటి రెండు సినిమాలు మినహా మిగిలినవి పెద్దగా సక్సెస్ కాకపోయినా ఈమెకు మాత్రం ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఏర్పడింది.


పాపులర్ అవ్వాలని….

ప్రస్తుతం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా శ్రీ లీల బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇకపోతే శ్రీ లీల సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇటీవల ఈమె సోషల్ మీడియా వేదికగా బిగ్ డే ఇన్ మై లైఫ్ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు అలాగే పెళ్లికూతురిలా ముస్తాబయి ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఏంటి శ్రీ లీల పెళ్లి చేసుకోబోతోందా అంటూ అభిమానులు అందరూ షాక్ లో ఉన్న నేపథ్యంలో అది పెళ్లి కాదని, ప్రీ బర్తడే సెలబ్రేషన్స్ అంటూ క్లారిటీ ఇచ్చారు.


అమాయకురాలు కాదు…

ఇకపోతే ఈమె బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే ఈమె కార్తీక్ ఫ్యామిలీలో జరిగిన వేడుకలకు హాజరు కావడం, కార్తీక్ ఆర్యన్ తల్లి తనకు కాబోయే కోడలు డాక్టర్ కావాలని చెప్పడంతో కచ్చితంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే ఈ విషయాన్ని బయట పెడతారని అందరూ భావించారు. ఇలా శ్రీ లీల గురించి నిత్యం ఏదో ఒక వార్త వస్తున్న నేపథ్యంలో ప్రముఖ డైరెక్టర్ గీతాకృష్ణ (Geetha Krishna)స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీ లీల గురించి ఈయన మాట్లాడుతూ ఆమెపైకి అమాయకంగా కనిపిస్తుంది కానీ కనిపించే అంత సాఫ్ట్ కాదని పెద్ద ముదురు అంటూ తెలిపారు.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు సినిమాల ద్వారా వార్తల్లో ఉండాలని కోరుకుంటారు. ఇక సినిమాలు లేకపోతే వాళ్ళని ఎవరూ పట్టించుకోరు. అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇక సోషల్ మీడియాలో తరచూ ఈ విధమైనటువంటి రూమర్లను పుట్టిస్తే వారికంటూ ఒక ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే హీరోయిన్లు అలా చేస్తుంటారని, శ్రీ లీల కూడా చాలా తెలివిగా తన మార్కెట్ పెంచుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తున్నారని డైరెక్టర్ గీతాకృష్ణ శ్రీ లీల గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. శ్రీ లీల ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులో మాస్ జాతర సినిమాలో నటిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×