BigTV English

Atlee – Allu Arjun : నువ్వు తీసే ఆల్ మిక్సర్ సినిమాకి ఇంత ఎలివేషన్ ఎందుకు?

Atlee – Allu Arjun : నువ్వు తీసే ఆల్ మిక్సర్ సినిమాకి ఇంత ఎలివేషన్ ఎందుకు?

Atlee – Allu Arjun : తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్ లో అట్లీ ఒకడు. శంకర్ దగ్గర శిష్యుడుగా పనిచేసిన అట్లీ రాజా రాణి సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమా తర్వాత అట్లే ఒక స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. తమిళ్ స్టార్ హీరో విజయ్ తో వరుసగా సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. విజయ్ చేసిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించిపెట్టాయి. ఆ తర్వాత బాలీవుడ్ లో షారుక్ ఖాన్ తో దర్శకుడుగా సినిమా చేసే అవకాశం అట్లీకి దక్కింది. సినిమా చేసే అవకాశం దక్కడం వేరు ఆ సినిమా సక్సెస్ కావడం వేరు. జవాన్ విషయంలో సక్సెస్ అట్లీకి మంచి ప్లస్ అయింది. దాదాపు 1000 కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా కలెక్షన్స్ చేసింది. దీనితో అట్లీ రేంజ్ విపరీతంగా మారిపోయింది.


సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేశాడా 

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దీపికా పదుకొనే నటిస్తున్న సంగతి అధికారకంగా ప్రకటించారు. ఇటీవలే స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా రెస్పాండ్ అయ్యాడు. అయితే ఈ తరుణంలో దీపికా పదుకొనే అట్లీ సినిమాలో చేస్తుంది అని ఒక అఫీషియల్ వీడియోతో నేడు అనౌన్స్మెంట్ వదిలారు. ఇప్పుడు దీనిపై వ్యతిరేకమైన నెగిటివ్ కామెంట్స్ అట్లీ పైన వస్తున్నాయి. ముఖ్యంగా ఇంత బిల్డప్ ఎందుకు, సందీప్ రెడ్డి వంగను ఇన్ డైరెక్ట్ గా రోస్ట్ చేస్తున్నాడా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాలో భారీ స్థాయిలో ఉండబోతున్నట్లు రిలీజ్ చేసిన వీడియో బట్టి అర్థమవుతుంది.


ఆల్ మిక్స్ సినిమాకి అంత ఎలివేషన్ అవసరమా 

అట్లీ విషయానికి వస్తే ఒక కమర్షియల్ సినిమాను ఎలా డిజైన్ చెయ్యాలో తనకు బాగా తెలుసు. చాలా సినిమాల నుంచి ఇన్స్పైర్ అయ్యి యాక్షన్ సీక్వెన్సెస్ ను రాస్తూ ఉంటాడు. జవాన్ సినిమాలో కూడా వేరే సినిమాలో సీన్స్ కొన్ని కనిపిస్తూ ఉంటాయి. దీనిపై కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అన్ని సినిమాలను మిక్స్ చేసే ఒక సినిమా కోసం ఇంత భారీ ఎలివేషన్ ఎందుకు అని ఈరోజు రిలీజ్ అయిన వీడియో మీద కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎస్.ఎస్ రాజమౌళి తన సినిమాకు SSMB29 వర్కింగ్ టైటిల్ పెట్టారు. కానీ అట్లీ మాత్రం ఆరువ సినిమాకి A6 అని పెట్టుకోవడంపై కూడా ట్రోలింగ్ నడుస్తుంది.

Also Read : Thug Life Trisha Role: స్నేహ, అనుష్క లు చేసిన ఐటమ్ రోల్స్ కు రాని నెగిటివిటీ త్రిష పైనే ఎందుకు?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×