Director Geethakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఉన్నారు. అందులో అప్పటి రోజుల్లో వాళ్ళు తీసిన సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ డైరెక్టర్లు ఈమధ్య కొన్ని సినిమాలకు సలహాదారులుగా పని చేస్తుంటారు. మరి కొంతమంది సినిమాలపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.. అలాంటి వారిలో ప్రముఖ తెలుగు డైరెక్టర్ గీతాకృష్ణ ఒకరు.. డైరెక్టర్ గా ఎన్నో సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. కానీ ఈ మధ్య మాత్రం పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ లిస్టు తెలుగు చిత్ర పరిశ్రమపై విమర్శలు గుప్పిస్తున్నారు.. ఆయన ఇంటర్వ్యూలు ఎంతగా వైరల్ అవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా అలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో దగ్గుబాటి ఫ్యామిలీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది. అందులో ఆయన ఏమన్నారు ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
దగ్గుబాటి ఫ్యామిలీ పిసినారి వాళ్లు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఒకటి.. ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలేస్తున్న ఫ్యామిలీలలో ఇది కూడా ఒకటి. ఈ ఫ్యామిలీ నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చింది తక్కువ మంది అయినా కూడా దగ్గుబాటి సురేష్ ప్రొడక్షన్ పై ఎన్నో సినిమాలు తెరకెక్కుతున్నాయి. కొన్ని సినిమాలకు రీమేక్ హక్కులను కూడా కొనుగోలు చేసి ఆ సినిమాలతో మంచి హిట్ ను అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.. అలాంటి ఫ్యామిలీపై ప్రముఖ డైరెక్టర్ గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. దగ్గుబాటి ఫ్యామిలీ గురించి ఎన్నో నిజాలను బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రొడక్షన్ లో సినిమాలు వస్తే కేవలం 10 మంది లోపలే షూటింగ్ జరుపుకుంటారు. అయితే ఈ ఫ్యామిలీ లోని ప్రతి ఒక్కరు కూడా పిల్లికి బిక్షం కూడా వేయరు.. అంత పిసినారి వాళ్ళు అంటూ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు డైరెక్టర్ గీతాకృష్ణ. అందుకే ఆ ప్రొడక్షన్ నుంచి వచ్చే సినిమాలు హిట్ అవుతున్నాయి. కానీ ప్రొడక్షన్ కి తక్కువ ఖర్చు అవుతుంది అంటూ మరో విషయాన్ని బయట పెట్టారు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..
గీతాకృష్ణ సినిమాలు..
టాలీవుడ్ డైరెక్టర్ గీతాకృష్ణ ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. కోకిల వంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇప్పుడు బాగా వర్కవుట్ అవుతున్నాయని గీతాకృష్ణా అన్నారు. తెలుగులో ఓ కొత్త ప్రింట్‌ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారని వెల్లడించారు. తాను కూడా రెండు మూడు సినిమాలు చేయాలని అనుకుంటున్నానని, మంచి కథ కోసం చూస్తున్నట్లు ఆయన తెలిపారు.. ఇప్పుడు హీరోలు అవకాశాలు ఇస్తే మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకుంటాను అంటున్నారు. ఈమధ్య ఈయన యూట్యూబ్ ఛానల్ కి ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఇప్పుడు మరోసారి దగ్గుబాటి ఫ్యామిలీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. మరి ఆయన వ్యాఖ్యలపై దగ్గుబాటి ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి…