Rishabh Pant : లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ సీజన్ ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇతను లీగ్ దశలో జరిగిన మ్యాచ్ ల్లో మూడు, నాలుగు మ్యాచ్ ల్లో మినహా మిగతా మ్యాచ్ ల్లో అంతగా ప్రదర్శన కనబరచలేదు. కానీ చివరి మ్యాచ్ లో మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు. లక్నో కెప్టెన్ పంత్ 61 బంతుల్లో 118 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే సెంచరీ సాధించిన సమయంలో రిషబ్ పంత్ గ్రౌండ్ లోనే గంతులు వేశాడు. చిన్న పిల్లాడిలా గాలిలో తిరుగుతూ గిర్రున ఎగిరాడు. ఇది చూసిన వారంతా పిచ్చోడిలా అలా చేస్తున్నాడు అని కొందరూ పేర్కొనడం గమనార్హం.
Also Read : Will O’Rourke: RCBకి అమ్ముడుపోయిన విలియం ఒరోర్కే…బకరా అయిన లక్నో
రిషబ్ పంత్ పిచ్చోడిలా గంతులు వేయడంతో విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ సీరియస్ అయ్యారు. పంత్ ఏంది ఇలా చేస్తున్నాడని ఆశ్చర్యపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిషబ్ పంత్ సందడి చూసి లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులు కేరింతలు కొడితే.. ఆర్సీబీ అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇక తొలుత ఈ మ్యాచ్ లో లక్నో జట్టు 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు భారీ స్కోర్ సాధించింది. మిచెల్ మార్ష్ 37 బంతుల్లో 67 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ, జితేష్ శర్మ, మయాంక్ అగర్వాల్ చెలరేగడంతో ఆర్సీబీ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది మూడో అత్యధిక లక్ష్య ఛేదన. బెంగళూరు మొత్తం 9 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
ఇక ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనంగానే ప్రారంభించింది. సాల్ట్ (30), కోహ్లీ చెలరేగడంతో 5 ఓవర్లు ముగిసే సమయానికి 60 పరుగులు చేసింది. వికెట్లు మాత్రం ఒకటి కూడా కోల్పోలేదు. ఒరూర్క్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ లో కోహ్లీ.. నాలుగు ఫోర్లు బాదేశాడు. సాల్ట్ కూడా చకా చకా బౌండరీలు కొట్టాడు. సాల్ట్ ను ఆకాశ్ ఔట్ చేసినా.. 8వ ఓవర్ లో 90/1 తో ఆర్సీబీ బలంగా కనిపించింది. కానీ ఒరూర్క్ వరుస బంతుల్లో పాటిదార్ 14, లివింగ్ స్టన్ ను ఔట్ చేసి ఆ జట్టును దెబ్బతీశాడు. అయినప్పటికీ ఆర్సీబీ జోరు కొనసాగించింది. ఆకాశ్ బౌలింగ్ లో మయాంక్ అగర్వాల్ వరుస ఫోర్లు కొట్టాడు. కోహ్లీ కూడా ఒక ఫోర్ బాదడంతో ఆ ఓవర్ లో ఆకాశ్ 18 పరుగులు సమర్పించుకున్నాడు. చివరి 11 ఓవర్లలో 106 పరుగులు చేయాల్సిన స్థితిలో బెంగళూరు సాధించాల్సిన రన్ రేట్ అదుపులోనే ఉంది. విరాట్ కోహ్లీ ఔట్ కాగానే అంతా బెంగళూరు ఓడిపోతుందని భావించారు. కానీ జితేష్ శర్మ విధ్వంసంతో ఛేదన స్వరూపమే మారిపోయింది. 18 ఓవర్ లో ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నాడు ఓరూర్క్. 4 ఓవర్లలో 74 పరుగులు చేశాడు.