Yuganiki Okkadu: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పేరుకే కోలీవుడ్ హీరో అయినా ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యి, ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితులు అయ్యారు. తెలుగులో ‘ఊపిరి’ మూవీ లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈయన..2010లో నటించి విడుదల చేసిన చిత్రం ‘ఆయిరత్తిల్ ఒరువన్’. దీనినే తెలుగులో ‘యుగానికి ఒక్కడు’ పేరిట డబ్బింగ్ చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇటు ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా 2010లో వచ్చిన ఈ సినిమా లో రీమాసేన్, ఆర్. పార్దిబన్, ఆండ్రియా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Priyanka Chopra: హాలీవుడ్ కి గుడ్ బై చెప్పనుందా.. వరుస టాలీవుడ్ చిత్రాలలో అవకాశం..!
యుగానికి ఒక్కడు సినిమా సీక్వెల్ అనౌన్స్మెంట్..
ఇకపోతే అన్ని సినిమాలకు ఈమధ్య సీక్వెల్స్ వస్తున్న నేపథ్యంలో.. ఈ సినిమా సీక్వెల్ కూడా రావాలి అని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు మేకర్స్. ‘ఆయిరత్తిల్ ఒరువన్ -2’ పేరిట అనౌన్స్మెంట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఇంతలోనే ఈ సినిమాలో హీరోగా కార్తీని కాకుండా ధనుష్ (Dhanush)ని తీసుకున్నారు. అలా ధనుష్ ని తీసుకుంటున్నట్లు సినిమా పోస్టర్తో సహా అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేకపోవడం గమనార్హం.
యుగానికి ఒక్కడు సీక్వెల్ పై స్పందించిన డైరెక్టర్..
ఇక దీంతో ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడు ఉంటుంది అని అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా దర్శకుడు డైరెక్టర్ సెల్వరాఘవన్ (Selva Raghavan) పార్ట్ 2 పై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. డైరెక్టర్ సెల్వ రాఘవన్ మాట్లాడుతూ..” నేను యుగానికి ఒక్కడు సినిమా సీక్వెల్ ప్రకటించి తప్పు చేశాను. సినిమాపై ఉన్న బజ్ తోనే పార్ట్ 2 కూడా అనౌన్స్ చేసాము. కానీ ఆ తర్వాత జరిగే ఎఫెక్ట్ అందరికీ తెలిసిందే కదా.. ఈ మూవీ సీక్వెల్ అనౌన్స్మెంట్ వచ్చిన రోజు నుంచి దీనిపై అప్డేట్స్ అడుగుతూనే ఉన్నారు. అయితే పార్ట్ 2 లో హీరోగా ధనుష్ (Dhanush ) ను ప్రకటించాము. కానీ కార్తీ లేకుండా ‘యుగానికి ఒక్కడు’ సినిమాని ఊహించుకోలేను. కాబట్టి పార్ట్-2 లో ధనుష్ తో పాటు కార్తీ కూడా నటిస్తారు. అయితే ఈ సినిమా కోసం వారిద్దరు కూడా ఒక సంవత్సరం పాటు తమ సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. అటు నేను కూడా ఈ సినిమాను చాలా పగడ్బందీగా నిర్మించాలనుకుంటున్నాను. ఈ నేపథ్యంలోనే ఒక పెద్ద కంపెనీ ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వస్తే త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తాము అంటూ సెల్వరాఘవన్ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఇద్దరు హీరోలు తమ సినిమాలను కాస్త పక్కన పెట్టైనా ఈ సినిమా కోసం ఒక ఏడాది సమయాన్ని కేటాయించాలని, అలాగే ఎవరైనా బడా నిర్మాతలు ఈ సినిమా కోసం రంగంలోకి దిగాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.? ఎవరు ఈ సినిమాని టేక్ ఓవర్ చేసుకుంటారో ? అన్నది తెలియాల్సి ఉంది.