Indian Railways: విశాఖపట్నం- లింగంపల్లి మధ్య రాకపోకలు కొనసాగించే జన్మభూమి ఎక్స్ ప్రెస్ రూటు మారనుంది. ఇకపై ఈ రైలు చర్లపల్లి- అమ్ముగూడ, సనత్ నగర్ మీదుగా శాశ్వత ప్రాతిపదికన నడిపించాలని వాల్తేర్ రైల్వే డివిజన్ నిర్ణయించింది. ఈ రైలులకు సంబంధించి సికింద్రాబాద్, బేగంపేట స్టాప్ లను తొలగిస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఈ మార్పుల గురించి తెలుసుకుని తగిన విధంగా ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
ఈ నెల 25 నుంచి చర్లపల్లి- అమ్ముగూడ- సనత్ నగర్ మీదుగా..
ఈ నెల 25 నుంచి జన్మభూమి ఎక్స్ ప్రెస్ చర్లపల్లి- అమ్ముగూడ- సనత్ నగర్ మీదుగా రాకపోకలు సాగిస్తాయని వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం కె సందీప్ వెల్లడించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రయాణీకులు ఈ మార్పును గుర్తుంచుకోవాలన్నారు.
విశాఖపట్నం- లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్ (12805)
ఏప్రిల్ 25 నుంచి విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్ (12805) రైలు విశాఖపట్నం నుంచి ఉదయం 6.20 గంటలకు బయల్దేరుతుంది. సాయంత్రం 6.05 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. 5 నిమిషాల పాటు అక్కడ హాల్టింగ్ తీసుకుంటుంది. 6.10 గంటలకు బయల్దేరి సాయంత్రం 7.40 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.
లింగంపల్లి- విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12806)
ఏప్రిల్ 26 నుంచి లింగంపల్లి- విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12806) రైలు లింగంపల్లి నుంచి ఉదయం 6.15 గంటలకు బయల్దేరుతుంది. ఉదయం 7.15 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. అక్కడి 5 నిమిషాల పాటు ఆగుతుంది. ఉదయం 7.20 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి సాయంత్రం 7.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
Read Also: వందే భారత్ లోకో పైలట్ జీతం ఎంత? ఆ ఉద్యోగానికి కావల్సిన అర్హతలేంటీ?
విశాఖ రైళ్లకు ఫుల్ డిమాండ్
ప్రతిరోజు సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి 12 రైళ్లు విశాఖపట్నం వెళ్తుంటాయి. అయినా, ప్రయాణీకుల నుంచి ఇంకా డిమాండ్ ఉంటుంది. రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. రెండూ పూర్తి స్థాయి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. చర్లపల్లి మీదుగా మార్చిన రైళ్లకు బదులుగా సికింద్రాబాద్ నుంచి మరికొన్ని రైళ్లను ప్రకటించాలని ప్రయాణీకులు కోరుతున్నారు.
Read Also: సమ్మర్ లో ఫారిన్ ట్రిప్స్? తక్కువ ఖర్చులో బెస్ట్ 7 కంట్రీస్ ఇవే!
Read Also: ఈ రైళ్లు సికింద్రబాద్‌లో ఆగవు.. ఇకపై చర్లపల్లి, కాచిగూడ నుంచే రాకపోకలు!