BigTV English
Advertisement

Harish Shankar: తెలుగు ఆడియన్స్ పై డైరెక్టర్ విమర్శలు.. నెటిజెన్స్ ట్రోల్స్.. ఏమన్నారంటే?

Harish Shankar: తెలుగు ఆడియన్స్ పై డైరెక్టర్ విమర్శలు.. నెటిజెన్స్ ట్రోల్స్.. ఏమన్నారంటే?

Harish Shankar.. ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు, ఏ ఉద్దేశంతో అలాంటి కామెంట్లు చేస్తారో తెలియదు కానీ.. అనవసరంగా చిక్కుల్లో పడుతున్నారని చెప్పవచ్చు. మొన్నటికి మొన్న విశ్వక్ సేన్ (Vishwak Sen) లైలా(Laila ) ప్రీ రిలీజ్ ఈవెంట్లో 30 ఇయర్స్ పృథ్వీరాజ్ (Prudhvi Raj) వైసీపీ పార్టీని దృష్టిలో పెట్టుకొని ఇన్ డైరెక్ట్ గా సినిమా వేదికపై రాజకీయాలు మాట్లాడడంతో అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు వైసీపీ , అల్లు అర్జున్(Allu Arjun) అభిమానుల దెబ్బకు లైలా మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈరోజు నిర్మాత ఎస్కేఎన్ (SKN) తెలుగు హీరోయిన్స్ ని దృష్టిలో పెట్టుకొని తెలుగు హీరోయిన్స్ కి అందుకే అవకాశాలు ఇవ్వరు అంటూ కామెంట్లు చేయడంతో ప్రముఖ హీరోయిన్ రేఖ భోజ్ కూడా దిమ్మతిరిగే కౌంటర్ వేసింది. ఇవన్నీ చాలవు అన్నట్టు ఇప్పుడు డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కూడా తెలుగు ఆడియన్స్ పై వ్యంగ్యంగా కామెంట్లు చేయడంతో నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలేమైందో ఇప్పుడు చూద్దాం.


తెలుగు ఆడియన్స్ పై హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్..

ప్రస్తుతం ‘లవ్ టుడే’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) తాజాగా నటించిన ‘రిటర్న్ ఆఫ్ డ్రాగన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్మాత ఎస్కేఎన్ తో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.. ఆయన మాట్లాడుతూ..” మన తెలుగు ప్రేక్షకులు మన సినిమాలు చూడరు. కానీ బయట సినిమాలు మాత్రం బానే చూస్తారు. ముఖ్యంగా మంచి సినిమాలు చేసినా సరే తెలుగు ఆడియన్స్ మాత్రం తెలుగు సినిమాలను ఆదరించరు. ఇక ఇది వేరే ఇండస్ట్రీ సినిమా కాబట్టి కచ్చితంగా చూస్తారు” అంటూ కాస్త వెటకారంగా కామెంట్లు చేశారు హరీష్ శంకర్. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.


హరీష్ శంకర్ పై నెటిజన్స్ ఫైర్..

ఇకపోతే హరీష్ శంకర్ కి వ్యతిరేకంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే ఏ సినిమానైనా ఆదరిస్తారు.. ఈ విషయాన్ని చెప్పడం పోయి.. తెలుగు సినిమాలను పక్కనపెట్టి వేరే భాష సినిమాలను ఆదరిస్తున్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. వాస్తవానికి హరీష్ శంకర్ తన కెరియర్ మొదలు పెట్టినప్పటి నుండి ఎక్కువగా స్ట్రెయిట్ సినిమాల కంటే రీమేక్ సినిమాలనే చేస్తూ వస్తున్నారు. చివరిగా ఆయన రవితేజ(Raviteja) తో చేసిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా కూడా రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోని ఇలా పలు ప్రమోషన్ ఈవెంట్స్ కి హాజరవుతున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×