KCR BIRTHDAY: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు ఆయన కుమారుడు, బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘పిల్లలు ఎవరికైనా తన నాన్నే గొప్ప హీరో అవుతాడు. కానీ మా నాన్న నా ఒక్కడికే కాదు. తెలంగాణకే హీరో కావడడం నాకు దక్కిన అదృష్టం. ప్రత్యేక రాష్ట్ర కలను కనడమే కాకుండా దాని నెరవేర్చిన గొప్ప నాయకుడు కేసీఆర్. దాని కోసం వ్యక్తిగతంగా తన జీవితాన్నే సైనం పణంగా పెట్టారు. ఆయన వారసత్వానికి అర్హుడిగా ఉండేందుకు ప్రతి క్షణం కృషి చేస్తాను’ అంటూ కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన తండ్రి కేసీఆర్ సాధించి దానిలో అణువంతైన సాధించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కొడుకు అని చెప్పుకునేందుకు గర్వంగా ఉందన్నారు. కేసీఆర్ వారసత్వానికి అర్హుడిగా ఉండేందకు ప్రతి క్షణం కృషి చేస్తానని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
కాగా, ఈ రోజుతో మాజీ సీఎం కేసీఆర్ 70 వసంతాలు పూర్తిచేసుకుని.. 71వ పడిలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. కొంత మంది వాట్సాప్ స్టేటస్ లు పెట్టుకుంటున్నారు. గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో కేసీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బర్త్ డే వేడుకులు నిర్వహించాయి.
ALSO READ: APAAR ID Card: ఆధార్ కార్డులా స్టూడెంట్స్‌కు అపార్ కార్డు.. దీంతో ఇన్ని లాభాలా..?
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న తర్వాత కేసీఆర్ కొన్ని రోజుల వరకు ప్రజల్లోకి రాలేదు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితం అయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాలేదు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సమయంలో మాత్రం జనాల్లోకి వచ్చారు. మళ్లీ ఆ తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఎప్పుడో ఓ సారి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలుస్తున్నారు. ఇటీవల ఫామ్ హౌస్ లోనే పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను కొడితే మామూలుగా ఉండదు. భూకంపం పుట్టిస్తానని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ALSO READ: CSIR Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ పాసైతే చాలు.. జీతం రూ.63,200 భయ్యా..
ఈ ఏడాది మొదటి నుంచి కేసీఆర్ జనాల్లో వస్తారని వార్తలు వచ్చినప్పటికి బయటకు రాలేదు. కానీ మరో రెండు రోజుల్లో అంటే ఫిబ్రవరి 19న మాత్రం పార్టీకి సంబంధించి కీలక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లాడుతారో అని ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. ఈ సమావేశం భారీ ఎత్తులో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు. దీంతో బీఆర్ఎస్ కు అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. దీంతో ఎల్లుండి జరిగే మీటింగ్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.