BigTV English

Kalyan Shankar : ఆ డైరెక్టర్ ఓ పెద్ద దొంగ… కనిపించకుండా తిరుగుతున్నాడు అంతే…

Kalyan Shankar : ఆ డైరెక్టర్ ఓ పెద్ద దొంగ… కనిపించకుండా తిరుగుతున్నాడు అంతే…

Kalyan Shankar: యూత్ ఫుల్ కామెడీ సినిమా మ్యాడ్, తనదైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్ “మ్యాడ్” సీక్వెల్ “మ్యాడ్ స్క్వేర్” గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. మార్చి 28, 2025న విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెడీ, సినిమాలపై తనదైన దృక్పథాన్ని ఉల్లాసంగా వివరించారు.


“మ్యాడ్ స్క్వేర్” ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో, దర్శకుడు కళ్యాణ్ శంకర్ తన సినిమాలు మరియు కె.వి. అనుదీప్ సినిమాల మధ్య సరదా పోలిక చేశారు. “అనుదీప్ సినిమాల్లో హీరోలు అమాయకులు. కానీ నా సినిమాల్లో హీరోలు దొంగలు!” అంటూ ఫన్నీగా మాట్లాడాడు. అంతేకాదు, “రియల్ లైఫ్‌లో అనుదీప్ దొంగ… బయట దొరక్కుండా తిరుగుతున్నాడు!” అంటూ కామెంట్ చేసాడు.

2023లో విడుదలైన “మ్యాడ్” యూత్ ఫుల్ కాలేజ్ క్యాంపస్ కామెడీగా మంచి హిట్ కొట్టింది. సంగీత్ శోభన్, నర్నే నితిన్, రామ్ నితిన్ నటించిన ఈ సినిమా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మించబడింది. ఇప్పుడు వస్తోన్న సీక్వెల్ “మ్యాడ్ స్క్వేర్” మరింత డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిగించబోతోందని చిత్రబృందం చెబుతోంది.


కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ “రాజ్ కుమార్ హిరానీ చేసినట్టివి చేయాలని ఉంది” అన్నారు. “3 ఇడియట్స్,” “పీకే,” “సంజు” లాంటి బ్లాక్‌బస్టర్స్ తీసిన హిరానీ సినిమాల నుండి తాను చాలా ప్రభావితమయ్యానని తెలిపారు. ప్రస్తుతం “మ్యాడ్ స్క్వేర్” రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈసారి మరింత ఫన్, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్, వెరైటీ స్టోరీతో “మ్యాడ్ స్క్వేర్” ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది! ఈ సినిమా వచ్చేదాకా.. “మ్యాడ్” మూడ్‌కి రెడీ అవ్వండి!

మ్యాడ్ స్క్వేర్ కంప్లీట్ అయ్యాక కళ్యాణ్ శంకర్, టిల్లు 3ని డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సూపర్ హిట్ ఫ్రాంచైజ్ ని కళ్యాణ్ డైరెక్ట్ చేస్తున్నట్లు ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇప్పటికే ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చాడు. అదే ఈవెంట్ లో నాగ వంశీ మాట్లాడుతూ… మ్యాడ్ ఫ్రాంచైజ్ ని టిల్లు ఫ్రాంచైజ్ ని కలిపితే కూడా బాగుంటుంది. రెండు సినిమాలని ఒకరే డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రెండు ఫ్రాంచైజ్ లు కలిస్తే థియేటర్స్ లో బిగ్గెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ఆడియన్స్ ని నవ్వించడం గ్యారెంటీ. మరి కళ్యాణ్ శంకర్… మ్యాడ్ స్క్వేర్ లో టిల్లు ఫ్రాంచైజ్ ని కలుపుతున్నట్లు ఏమైన హింట్ ఇస్తాడా లేక టిల్లు 3లోకి డైరెక్ట్ గా మ్యాడ్ హీరోలని తీసుకోని వస్తాడా అనేది చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×