Ram Charan : ‘గేమ్ ఛేంజర్’ బాధ నుంచి మెగా ఫ్యాన్స్ దాదాపు తెరుకున్నట్టే. ఇప్పుడు వాళ్ల చూపు బుచ్చిబాబు దర్శకత్వలో వస్తున్న RC 16 పైన ఉంది. బుచ్చిబాబు ఫస్ట్ మూవీ ‘ఉప్పెన’ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు… ఆయన సుకుమార్ శిష్యుడు అవ్వడం వల్ల RC 16 మూవీపైన భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా విషయలో రామ్ చరణ్ మాత్రం కాస్త అసంతృప్తితో ఉన్నాడట. దీంతో బుచ్చిబాబు అండ్ టీం అలెర్ట్ అయ్యారని తెలుస్తుంది. మరి చరణ్ ఏ విషయంలో అసంతృప్తిగా ఉన్నాడో ఇక్కడ తెలుసుకుందాం…
గేమ్ ఛేంజర్ మూవీ తర్వాత రామ్ చరణ్ RC 16 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ చేస్తున్నాడు. దీనికి బుచ్చిబాబు సాన డైరెక్టర్. పక్కా విలేజ్ బ్యాగ్రౌండ్.. స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది ముందుగా ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన ఆట గురించి ఉంటుందని అందరూ అనుకున్నారు.
కానీ, లెటెస్ట్ గా వస్తున్న వార్తల ప్రకారం… ఈ సినిమాలో క్రికెట్, కాబడ్డి లాంటి మరి కొన్ని ఆటలు కూడా ఉంటాయట. అందులో రామ్ చరణ్ ఓ క్రీడా కూలీ పాత్ర చేస్తున్నట్టు టాక్ వస్తుంది. దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలీదు కానీ, ఇండస్ట్రీ సర్కిల్స్ లో మాత్రం ఇదే బాగా వైరల్ అవుతుంది.
రామ్ చరణ్ అసంతృప్తి..?
అలాగే, ఈ మూవీకి ‘పెద్ది’ అనే టైటిల్ ను బుచ్చిబాబు పరిశీలనలో ఉందట. ఈ మూవీకి స్క్రిప్ట్ రాసుకున్న టైంలోనే… ‘పెద్ది’ అనే టైటిల్ ను బుచ్చిబాబు ఫిక్స్ అయ్యాడట. ఫ్యాన్స్‌కి కూడా ఆ టైటిల్ బానే నచ్చింది. వాళ్లు ఆ టైటిల్ ని ఫిక్స్ అయిపోయి… సోషల్ మీడియాలో ఇప్పటికే పోస్ట్‌లు పెట్టడం స్టార్ట్ చేశారు. అయితే… ఈ మూవీ టైటిల్ రామ్ చరణ్ కు నచ్చలేదట.
నిజానికి, RC 16 మూవీకి పెద్ది అనే టైటిల్‌ను ఫైనల్ చేద్దామని బుచ్చిబాబు అనుకున్నాడట. కానీ, ఆ టైటిల్ రామ్ చరణ్‌కు నచ్చకపోవడంతో… పెద్ది టైటిల్‌ను వర్కింగ్ టైటిల్ గా మార్చుకున్నారట. పూర్తి స్థాయి టైటిల్ ఏం పెట్టాలని ఇప్పుడు బుచ్చి బాబు అండ్ టీం తెగ సెర్చ్ చేస్తున్నారట.
RC బర్త్ డే ట్విస్ట్ ఉంటుందా..?
రామ్ చరణ్ బర్త్ డే ఈ నెల 27న జరగబోతుంది. బర్త్ డే అంటే మూవీ నుంచి ఏదో ఒక అప్డేట్ తప్పనిసరి. అయితే… టైటిల్ ను రివీల్ చేస్తారేమో అనుకుంటే… ‘పెద్ది’ ని చరణ్ రిజెక్ట్ చేశాడు. దీంతో టైటిల్ వేట ఇంకా కొనసాగుతుంది. దీంతో చరణ్ బర్త్ డేకి టైటిల్ అనౌన్స్ మెంట్ ఉండే ఛాన్స్ లేదు. కుదిరితే… చరణ్ ఫస్ట్ లుక్ వచ్చే ఛాన్స్ ఉంది.
RC 16 రిలీజ్ డేట్…
ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుంది. 2026 మార్చి 26న అంటే… రామ్ చరణ్ బర్త్ డే కి ఒక్క రోజు ముందు సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అందుకు అనుగూణంగా బుచ్చిబాబు వర్క్ కూడా జరుగుతుంది.