BigTV English

Karthik Subbaraj : నేను గేమ్ చేంజర్ సినిమాకు వన్ లైన్ ఆర్డర్ మాత్రమే ఇచ్చా

Karthik Subbaraj : నేను గేమ్ చేంజర్ సినిమాకు వన్ లైన్ ఆర్డర్ మాత్రమే ఇచ్చా

Karthik Subbaraj : దర్శకుడు శంకర్ టాలెంట్ ఏంటో అందరికీ తెలిసిందే ఇప్పుడు అందరూ పాన్ ఇండియా కాన్సెప్ట్ సినిమాలు గురించి మాట్లాడుతున్నారు. కానీ ఒకప్పుడు శంకర్ తీసిన ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా ఉండేది అయితే శంకర్ కూడా ఒక దశలో డిజాస్టర్ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. రజనీకాంత్ హీరోగా నటించిన రోబో సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా అసలైన పాన్ ఇండియా కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ఆ సినిమాకు సంబంధించి గ్రాఫిక్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో అనిపిస్తాయి. ఆ తర్వాత వచ్చిన రోబో 2 సినిమా ఆ స్థాయిలో ఆకట్టుకోలేదు. అయితే ప్రస్తుతం శంకర్ సినిమాలో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన భారతీయుడు 2 సినిమా ఎటువంటి డిజాస్టర్ అయిందో మనం చూసాం. అలానే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ కూడా అలానే అయింది.


భారీ డిజాస్టర్

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు అనగానే అందరికీ అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దానికి తోడు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు ఈ సినిమా వస్తుంది అని అంటే అందరికీ ఒక నమ్మకం కూడా వచ్చింది. ఎందుకంటే దిల్ రాజు ఒక సినిమాను ప్రొడ్యూస్ చేశాడు అంటే ఖచ్చితంగా దాంట్లో విషయం ఉంటుంది అని కొంతమంది అభిప్రాయం. ఈ సినిమాకి సంబంధించి కూడా అందరూ మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. దాదాపు ఈ సినిమా మూడేళ్లు పాటు షూటింగ్ చేశారు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత చరణ్ ఈ సినిమాలో నటిస్తుండడంపై అంచనాలు మరిన్ని పెరిగిపోయాయి. ఇది ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఫిలిం అని అనౌన్స్ చేసినప్పుడు ఇటువంటి కాన్సెప్ట్ శంకర్ బానే డీల్ చేస్తాడు అని అందరూ ఊహించారు. కానీ సినిమా చూసిన తర్వాత అందరూ డీలా పడ్డారు.


కార్తీక్ సుబ్బరాజ్ కథ

కార్తీక్ సుబ్బరాజు టాలెంట్ ఏంటో కేవలం తమిళ ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. ఎందుకంటే కార్తీక్ చేసిన చాలా సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి. అయితే ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు కథ అందిస్తున్నాడు అనగానే అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఈ విషయంపై కార్తీక్ సుబ్బరాజ్ స్పందించాడు. నేను ఈ సినిమా కథ ఇచ్చేటప్పుడు చాలా గ్రౌండ్ లెవెల్ లో ఉండేది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి మరియు పొలిటిషన్ కి మధ్య జరిగే వారని ఒక వన్ లైన్ ఆర్డర్ థాట్ చెప్పాను. అది విపరీతంగా శంకర్ సార్ కి నచ్చింది. ఆ తర్వాత చాలామంది రైటర్లు ఈ సినిమా కోసం ఇన్వాల్వ్ అయ్యారు. నేను చెప్పిన కథకి తీసిన సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు కార్తీక్ సుబ్బరాజ్.

Also Read : Janhvi Kapoor: పరమ్ సుందరిగా జాన్వీ కపూర్.. జోరు పెంచేసి

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×