Janhvi Kapoor.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. దివంగత నటీమణి శ్రీదేవి (Sridevi) కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె తల్లికి తగ్గ క్రేజ్ ను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక అలా బాలీవుడ్ సినిమాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె, ఇక తెలుగులోకి తన తల్లి కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) తో మొదటి సినిమా చేసి తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించింది. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘దేవర’ సినిమాలో జాన్వీ కపూర్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయి నటించింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్(Ram Charan) హీరోగా బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది.
పరమ్ సుందరిగా రాబోతున్న జాన్వీ కపూర్..
తెలుగులో రెండు సినిమాలకు సైన్ చేసిందో లేదో అప్పుడే తమిళంలో కూడా మరో కొత్త సినిమాకి సైన్ చేసింది ఈ ముద్దుగుమ్మ. నిన్న మొన్నటి వరకు డైరెక్టర్ పా.రంజిత్(Pa .Ranjith) దర్శకత్వం లో సినిమా చేయబోతుందంటూ వార్తలు రాగా..ఇప్పుడు అది కన్ఫామ్ అయిపోయింది. మరి కొద్ది రోజుల్లో ‘పరమ్ సుందరిగా’ తెరపై సందడి చేయడానికి ముస్తాబ్ అవుతోంది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అగ్రతారాల సరసన అవకాశాలు అందుకుంటూ జోరు పెంచింది ఈ ముద్దుగుమ్మ. ఇక అందులో భాగంగానే ‘పరమ్ సుందరి’ అనే సినిమాతో డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వంలో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.
వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్..
అయితే ఇది సినిమా కాకుండా వెబ్ సిరీస్ గా రాబోతుందట. గత కొన్ని నెలలుగా పా.రంజిత్ తో ఈ విషయంపై చర్చలు చేస్తోందని, మహిళ ప్రాధాన్య కథతో రూపొందుతున్న ఈ సిరీస్ లో అణిచివేత, సామాజిక సమస్యలే ప్రధాన కథాంశంగా ఉండనున్నట్లు సమాచారం. జూలైలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నహాలు కూడా చేస్తున్నారని జాన్వీ కపూర్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక ప్రస్తుతం ఈమె ఖాతాలో ‘సన్నీ సంస్కారికీ తులసి కుమారి’ అనే చిత్రం కూడా ఉండడం గమనార్హం. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ ఇటు సౌత్ అటు నార్త్ లో క్రేజీ ప్రాజెక్ట్ లను సొంతం చేసుకుని పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అయ్యే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక జాన్వి కపూర్ విషయానికి వస్తే ఎక్కువగా బ్రాండ్ ప్రమోషన్స్ కి హాజరవుతూ భారీగా సంపాదిస్తోంది. ఇటు సినిమాల ద్వారా కూడా ఒక్కో సినిమాకు రూ.4కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈమె తండ్రి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor)అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈయన ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా సినిమాలు నిర్మించాలని చూస్తున్నారు. ఇక జాన్వీ కపూర్ చెల్లి ఖుషీ కపూర్ (Khushi Kapoor) కూడా సినిమాల ద్వారా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.