HBD Koratala Shiva: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో డైరెక్టర్ కొరటాల శివ(Koratala Shiva) ఒకరు. ఈయన దర్శకుడిగా కంటే కూడా కథ రచయితగా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇలా రచయితగా గుర్తింపు పొందిన కొరటాల శివ అనంతరం ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి(Mirchi) సినిమా ద్వారా దర్శకుడిగా మారి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక అందరిలాగే కొరటాల శివకు కూడా ఇండస్ట్రీలో హిట్ సినిమాలతో పాటు ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయని చెప్పాలి. ఇక నేడు కొరటాల శివ తన పుట్టినరోజును (Birthday)జరుపుకుంటున్న నేపథ్యంలో తన సినీ కెరియర్ గురించి ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
రచయితగా సక్సెస్..
కొరటాల శివ రచయితగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భద్ర సినిమాకు పని చేశారు. అనంతరం మున్నా, ఒక్కడున్నాడు, సింహ, ఊసరవెల్లి వంటి చిత్రాలకు రచయితగా పనిచేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా రచయితగా సక్సెస్ అందుకున్న కొరటాల శివ మిర్చి సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కొరటాల అనంతరం శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఊహించని దెబ్బ కొట్టిన ఆచార్య…
ఇలా ఈయన వరుస సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న నేపథ్యంలో ఈయనకు ఊహించని ఫ్లాప్ వచ్చి పడిందని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య(Aacharya) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఆచార్య సినిమా ద్వారా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొరటాలకు ఊహించని షాక్ ఎదురైంది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక డిజాస్టర్ గా నిలిచింది. దర్శకుడిగా దూసుకుపోతున్న కొరటాల కెరియర్ కు ఆచార్య సినిమా మైనస్ గా మారిందని చెప్పాలి.
దేవరతో రుజువు..
ఆచార్య సినిమాతో ఊహించిన డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్న కొరటాలను నమ్మి ఎన్టీఆర్ మరోసారి ఈయనకు దేవర (Devara)సినిమాలో అవకాశం కల్పించారు. అయితే ఈ సినిమా ద్వారా తానేంటో కొరటాల మరోసారి రుజువు చేసుకున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా సక్సెస్ కావడంతో కొరటాల డైరెక్షన్లోనే ఎన్టీఆర్ దేవర 2 సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇలా కొరటాల శివ రచయితగా దర్శకుడుగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారని చెప్పాలి. ఇక నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న దర్శకుడు కొరటాల శివకు పెద్ద ఎత్తున అభిమానులు హీరోలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.