Sandeep Reddy: చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో డైరెక్టర్ సందీప్ రెడ్డి(Sandeep Reddy) ఒకరు. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా తెలుగులో సంచలనమైన విజయాన్ని అందుకున్న ఈయన ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసే అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అప్పటినుంచి బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమైన సందీప్ రెడ్డి ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల యానిమల్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సందీప్ రెడ్డి త్వరలోనే ప్రభాస్ తో కలిసి స్పిరిట్ (Spirit)సినిమా పనులలో బిజీ కాబోతున్నారు.
దీపిక డిమాండ్ సరైనదే…
ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా బాలీవుడ్ నటి దీపికా పదుకొనేని(Deepika Padukone) హీరోయిన్ గా తీసుకోవాలని భావించారు. కానీ ఈ సినిమా కోసం ఆమె పలు డిమాండ్లను చేశారని, ఆ డిమాండ్లు సందీప్ రెడ్డికి నచ్చకపోవడంతోనే ఆమెను తప్పించారని తెలిసిందే. అయితే ఈ విషయంపై సందీప్ రెడ్డి వర్సెస్ దీపిక అనే విధంగా వివాదం కూడా నడిచింది. ఇక ఈ వివాదం పై పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ దీపికాకు మద్దతు తెలిపారు. తాజాగా మరో సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం సైతం ఈ విషయంలో నటి దీపికాకు మద్దతు తెలపడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.
ఇవన్నీ ముందే చూసుకోవాలిగా…
ప్రస్తుతం మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన “థగ్ లైఫ్” సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జూన్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మణిరత్నంకు దీపిక సందీప్ రెడ్డి వివాదం గురించి ప్రశ్న ఎదురైంది. ఒక దర్శకుడిగా మణిరత్నం ఈ ఘటనపై స్పందిస్తూ తాను నటి దీపికాకు మద్దతు తెలుపుతానని వెల్లడించారు. దీపికాకు ఇటీవల కూతురు జన్మించిన విషయం తెలిసిందే. చిన్న పాప ఉన్న నేపథ్యంలో తాను ఎనిమిది గంటల పాటు పనిచేయ్యనని తెలిపారు. దీంతో సందీప్ రెడ్డి ఆమెను తప్పించారు.
https://twitter.com/Movies4u_Officl/status/1929781021685567503?t=hTXQ7StPT–djIiQXIy17g&s=19
ఇక ఈ విషయం గురించి మణిరత్నం మాట్లాడుతూ ప్రస్తుతం దీపిక ఉన్న పరిస్థితిని బట్టి ఆమె ఇలాంటి డిమాండ్ బయటపెట్టింది. ఒక ఈ చిత్ర నిర్మాతగా మీరు ఆమెను ఎంపిక చేసుకునే సమయంలోనే ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకొని ఉండాల్సింది అంటూ మణిరత్నం తెలిపారు. నాకు తెలిసి ఈ విషయంలో దీపిక సరైన, న్యాయబద్ధమైన డిమాండ్ చేశారని భావిస్తున్నానంటూ మణిరత్నం తెలిపారు. ఇలా దీపికా పదుకొనేకు మద్దతుగా మణిరత్నం మాట్లాడటంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక సందీప్ రెడ్డి దీపిక వివాదంలో ఎక్కువ భాగం డైరెక్టర్ సందీప్ ను తప్పు పడుతూ దీపికాకే మద్దతు తెలపటం గమనార్హం. ఈ సినిమా నుంచి దీపిక తప్పుకోవడంతో మరొక బ్యూటీ త్రిప్తి దిమ్రిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.