Rajasaab Movie : పాన్ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ లో పెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో అర డజను సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది ముందుగా రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్నీ అప్డేట్స్ ఆడియన్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమాను ఎప్పుడు చూస్తామని అటు డార్లింగ్ ఫాన్స్, ఇటు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని ముందుగా ఏప్రిల్ 10 న విడుదల చేద్దాం అనుకున్నారు. టాకీ పార్ట్ దాదాపుగా పూర్తి అయిపోయినప్పటికీ, గ్రాఫిక్స్ వర్క్ ఇంకా చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో సమ్మర్ బరిలోంచి బయటకు వచ్చేసింది.. సినిమా విడుదల లేట్ అవ్వడంతో ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అదేగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఈ మూవీలో రెండు ట్విస్ట్ లు ఉన్నాయని తెలుస్తుంది.. సినిమాని మలుపు తిప్పేది ఆ రెండు ట్విస్టు లే అని ఓ వార్త ప్రచారంలో ఉంది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..
ప్రభాస్ గతంలో నటించిన సినిమాలకి ఈ సినిమాకి చాలా వ్యత్యాసం ముందున్న విషయం టీజర్ ని చూస్తే అర్థమవుతుంది. అనుకున్నట్లుగానే మారుతి ఈ సినిమాతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పరిచయం చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. సినిమాకి సంబంధించి రెండు కీలకమైన ట్విస్టులు ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయిపోయాయి. గ్లిమ్స్ వీడియో లో మనం ప్రభాస్ కింగ్ అవతారం లో కుర్చీలో కూర్చొని నోట్లో సిగార్ పెట్టుకొని స్టైల్ గా కనిపించిన పాత్ర పేరు ఠాకూర్ సాబ్ అట. ఈ పాత్ర ప్రస్తుత కాలం లో ఉండే రాజా సాబ్ క్యారక్టర్ కి తండ్రి అన్నమాట.. ఈ మూవీలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభాత్ కి తాత పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపించనున్నారు..
ఆయన కూడా దెయ్యం క్యారక్టర్ అట. ఇలా ఈ ముగ్గురి మధ్య సాగే స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉండబోతుందని తెలుస్తుంది.. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె దెయ్యం క్యారక్టర్ చేస్తుందా అని సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చెయ్యగా.. దానికి ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ లో కాదని చెప్పి క్లారిటీ ఇచ్చింది. ఆమె క్యారక్టర్ ఇచ్చే ట్విస్ట్ కి థియేటర్స్ లో ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి అని చెప్పుకొచ్చింది. ఇంతలా చెప్తుందంటే, ఇందులో ఆమె విలన్ క్యారక్టర్ చేస్తుందా? లేదా పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.. ఇకపోతే ఇప్పటి వరకు ఒక్క డైరెక్టర్ కూడా ప్రభాస్ కామెడీ టైమింగ్ ని పూర్తిగా వాడుకోలేదు. రాజా సాబ్లో మాత్రం ప్రభాస్ కామెడీతో నవ్విస్తాడని అంటున్నారు. మరి ఈ మూవీ ప్రభాస్ కు భారీ విజయాన్ని అందిస్తుందో? లేదో..? తెలియాల్సి ఉంది.. ఈ మూవీ తర్వాత పౌజి సినిమాలో ప్రభాస్ నటించిన ఉన్నాడు. ఆ తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2 సినిమాలతో ప్రేక్షకులను పలకరించనున్నారు..