Mollywood.. ప్రముఖ నటి దేవికా నంబియార్ (Devika Nambiar)తన ప్రెగ్నెన్సీ జర్నీ తలచుకొని ఎమోషనల్ అయింది. ఇటీవల రెండవ బిడ్డకు జన్మనిచ్చింది. తన డెలివరీ జర్నీ గురించి మాట్లాడుతూ.. “నా మొదటి ప్రెగ్నెన్సీ అంతా సాఫీగా సాగిపోయింది. ఇది కూడా అలాగే ఉంటుందని అనుకున్నాను. అందుకే బ్యాగు కూడా నేను సర్దుకోలేదు. అయితే ఈసారి ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. కానీ నేను ఎంత సేపటికి కళ్ళు తెరవకపోవడంతో అందరూ భయపడ్డారు. ఒక రోజంతా స్పృహ కోల్పోయాను. ఇక ఒకరోజు తరువాతే స్పృహలోకి వచ్చి నా బిడ్డను చూసుకున్నాను. అయితే అప్పటికీ కూడా నా కాళ్ళు , చేతులు కదలకపోవడంతో ఇక నేను చనిపోతానేమో అని కూడా అనుకున్నాను” అంటూ ఎమోషనల్ అయింది దేవిక.
ఆ క్షణం అంతా అయిపోయిందనుకున్నాను -దేవిక భర్త..
ఇక దేవిక భర్త ప్రముఖ సింగర్ విజయ్ మాధవ్ (Singer Vijay Madhav) మాట్లాడుతూ.. మాకు బిడ్డని చూపించారు. కానీ నా భార్యను చూపించలేదు. సమయం గడిచేకొద్దీ నాలో భయం ఎక్కువయింది. ఎలాగైనా సరే తనను కలవాల్సిందేనని గట్టిగా చెప్పాను. దాంతో వారు దేవిక స్పృహలో లేదని చెప్పారు. ఇక షాక్ అయ్యాను. ముక్కు, నోట్లో కూడా పైపులు పెట్టేశారు.తనను అలా చూడగానే ఇక అంతా అయిపోయింది అని అనుకున్నాను. ఇక ఆమెను ఎప్పుడూ కూడా అలా నేను చూడలేదు. అలా ఒక్కసారిగా చూసేసరికి గదిలోకి వెళ్లి బోరున ఏడ్చేసాను. ఆనాటి క్షణాలు గుర్తు చేసుకుంటే, మాకు ఇప్పటికీ భయాన్ని కలిగిస్తాయి” అంటూ విజయ్ తెలిపారు. మొత్తానికి అయితే సి సెక్షన్ తర్వాత దేవికా పడ్డ ఇబ్బందుల గురించి విజయ్ చెబుతూ అందరికీ కన్నీళ్లు తెప్పించారు. ఇకపోతే ఇంత సడన్గా దేవికాకు ఏమైంది అని అభిమానులు కూడా ఆరా తీస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికి అయితే ఇద్దరు బిడ్డల తల్లి అయిపోయింది దేవిక.
దేవిక కెరియర్..
దేవిక నంబియార్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. దేవిక కలభ మజా, గల్ఫ్ రిటర్న్స్, పరయాన్ బాకీ వచెత్తూ, కట్టప్ప నేయిల్ రిత్విక్ రోషన్ వంటి సినిమాలలో నటించింది. మాలీవుడ్ లోనే కాదు తమిళంలో కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది దేవిక. ఈమె నటి మాత్రమే కాదు యాంకర్ కూడా.. పలు షో లకు యాంకర్ గా వ్యవహరించింది. అంతేకాదు సినిమాల మధ్యలో ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక దేవిక 2011లో ‘మద్యపానం ఆరోగ్యతిని హానికరం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తర్వాత కొన్ని చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక 2022లో విజయ్ మాధవ్ ను వివాహం చేసుకున్న ఈ జంటకు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి జన్మించారు. విజయ్ విషయానికి వస్తే తిరువనంతపురం చెందినవారు కాగా.. దేవిక మంజేరీ ప్రాంతానికి చెందినవారు. తర్వాత చెన్నైకి షిఫ్ట్ అయిన వీరు అక్కడే ఉంటూ పలు సినిమాలు చేస్తూ కెరియర్ ను కొనసాగిస్తున్నారు.