BigTV English

Kalki 2 Update: కల్కి2 పై ఆసక్తికర కామెంట్ చేసిన నాగ్ అశ్విన్..!

Kalki 2 Update: కల్కి2 పై ఆసక్తికర కామెంట్ చేసిన నాగ్ అశ్విన్..!

Kalki 2 Update: వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ (Ashwini dutt) నిర్మాతగా, నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన పురాణ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా కల్కి 2898 AD మూవీ తెరకెక్కింది… పురాణ ఇతిహాసాలను బేస్ చేసుకుని వచ్చిన కల్కి 2898 AD మూవీలో కర్ణుడి పాత్రలో ప్రభాస్ (Prabhas), అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) నటించారు. ఇందులో మెయిన్ విలన్ గా కమల్ హాసన్ (Kamal Hassan) కనిపించారు. అయితే మొదటి పార్ట్ లో కమల్ హాసన్ స్క్రీన్ స్పేస్ ఎక్కువగా లేదు.కానీ సెకండ్ పార్ట్ లో కమల్ హాసన్, ప్రభాస్ మధ్యే ఎక్కువ సన్నివేశాలు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అయితే గత ఏడాది జూన్ 27న విడుదలైన కల్కి 2898AD మూవీ ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో చెప్పనక్కర్లేదు.అయితే ఈ మూవీపై కొంతమంది హిందువులు వ్యతిరేకత చూపించినప్పటికీ, ఎక్కువ శాతం మాత్రం ఈ సినిమాని ఆదరించారు. కల్కి మూవీకి పార్ట్ -2 ఉంటుంది అని మేకర్స్ అప్పుడే ప్రకటించారు.


కల్కి పార్ట్2 పై అప్డేట్..

అంతేకాకుండా కల్కి పార్ట్ 2 ఇప్పటికే 60% పూర్తయింది అని, మరికొంత శాతమే బ్యాలెన్స్ ఉంది అని చిత్ర దర్శకుడు నిర్మాత చెప్పారు. అయితే తాజాగా కల్కి పార్ట్ 2 పై క్రేజీ అప్డేట్ ఇచ్చారు నాగ్ అశ్విన్. ఈ సినిమాకి అన్నీ కలిసొస్తే అప్పుడే రిలీజ్ అంటూ గుడ్ న్యూస్ చెప్పేశారు.మరి ఇంతకీ ప్రభాస్ హీరోగా చేస్తున్న కల్కి పార్ట్ 2 ఎప్పుడు విడుదలవుతుందో ఇప్పుడు చూద్దాం. నాగ్ అశ్విన్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనను కల్కి పార్ట్ 2 మూవీ గురించే అప్డేట్ అడుగుతున్నారట. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. “కల్కి పార్ట్ -2 షూటింగ్ ప్రభాస్ లేని సన్నివేశాలన్నీ ముగించేసాం.అలాగే దీనికి సంబంధించిన వర్క్ కూడా పూర్తయింది. ఇక ప్రభాస్ కి సంబంధించిన సన్నివేశాలు ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడే పూర్తి చేస్తాం. ఆయన సమయం ఇవ్వాలే గాని సినిమా షూటింగ్ ఎంతసేపు.. ఆయన డేట్స్ ఇస్తే తొందరలోనే సినిమా షూట్ పూర్తి అవుతుంది.


రిలీజ్ అప్పుడే..

ఇప్పటికే ప్రభాస్ లేని ఎన్నో సన్నివేశాలను షూట్ చేశాం. ఇక అన్నీ బాగుండి, వర్క్ అంతా పూర్తయితే వచ్చే ఏడాది ఎండింగ్ వరకు ఈ సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం అంటూ కల్కి పార్ట్ -2 పై నాగ్ అశ్విన్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇక నాగ్ అశ్విన్ అప్డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే ఇప్పటికే ప్రభాస్ ది రాజా సాబ్, ఫౌజీ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండడం కారణంగా ఆయన కల్కి 2కి డేట్స్ ఈ ఏడాది ఇచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. అలాగే ఆయన చేతిలో స్పిరిట్, సలార్ -2 కూడా ఉన్నాయి.మరి చూడాలి వచ్చే ఏడాది అయినా కల్కి -3 కి ప్రభాస్ డేట్స్ ఇస్తారా.. ? ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది? అనేది ప్రభాస్ మీదే ఆధారపడి ఉంది. ఇక కల్కి పార్ట్ 2 లో దీపిక పదుకొనే,కమల్ హాసన్,ప్రభాస్, అమితాబ్ బచ్చన్ కాంబినేషన్లో ఎక్కువ సీన్స్ వస్తాయని తెలుస్తోంది.అలాగే పార్ట్ -2 కృష్ణుడి పాత్రలో ఎవరు నటిస్తారు అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×