BigTV English
Advertisement

IND Vs BAN : ఇండియానా… అదెక్కడుంది? బంగ్లాదేశ్ అభిమాని ఓవరాక్షన్

IND Vs BAN : ఇండియానా… అదెక్కడుంది? బంగ్లాదేశ్ అభిమాని ఓవరాక్షన్

IND Vs BAN : ఆసియా క‌ప్ 2025లో భాగంగా సెప్టెంబ‌ర్ 24న టీమిండియా వ‌ర్సెస్ బంగ్లాదేశ్ జ‌ట్ల సూప‌ర్ 4 మ్యాచ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ సంద‌ర్భంగా టీమిండియా గురించి సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ఇండియా నా..? అదెక్క‌డుంది అంటూ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంతో అత‌నిపై టీమిండియా అభిమానులు మండిప‌డుతున్నారు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ అభిమాని ఈ కామెంట్స్ చేస్తే.. మ్యాచ్ ముగిసిన త‌రువాత అత‌నికి టీమిండియా అభిమానులు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు.  ఇండియా ఎక్క‌డుందో తెలియ‌దా..? ఇండియా నుంచి విడిపోయి బంగ్లాదేశ్ దేశంగా అవ‌త‌రించిన విష‌యం వాడికి తెలియ‌న‌ట్టుంది. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. బంగ్లా దేశ్ జట్టుపైన 41 పరుగులు తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా.


Also Read : Inzamam-ul-Haq : అభిషేక్ శర్మ బ్యాట్ లో చిప్స్.. అందుకే దారుణంగా ఆడుతున్నాడు

ప‌సికూన పై చెల‌రేగిన టీమిండియా

బ్యాటింగ్ లో పెద్దగా రాణించచని టీమిండియా… బౌలింగ్ లో మాత్రం అదరగొట్టింది. పసి కూన బంగ్లాదేశ్ జట్టు పైన టీమ్ ఇండియా బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేశారు. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా… బుమ్రా, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు తీశారు. అక్సర్ పటేల్ ఒక వికెట్ తీయగా.. మరొకరు రన్ అవుట్ అయ్యారు. అటు తిలక్ వర్మ కూడా మరో వికెట్ తీశాడు. దీంతో 19.3 ఓవర్స్ లో.. 127 పరుగులు మాత్రమే చేసి… ఆల్ అవుట్ అయింది బంగ్లాదేశ్. దీంతో ఆసియా కప్ ఫైనల్ కు టీం ఇండియా చేరుకుంది. శ్రీలంక ఇంటిదారి పట్టింది. బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్ రెండిటిలో ఒక జట్టు ఫైనల్ కి వస్తుంది.


Also Read : Team India : వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక..వైస్ కెప్టెన్ గా జ‌డేజా..షెడ్యూల్ ఇదే

టీమిండియా పై య‌టకారంగా మాట్లాడిన బంగ్లా అభిమాని.. సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్స్..

ఒమాన్ మ్యాచ్ లో బ్యాటింగ్ చేయ‌ని సూర్య కుమార్ యాద‌వ్‌…ఇవాళ్టి మ్యాచ్ లో మాత్రం.. టీమిండియా బ్యాటింగ్ ఆర్డ‌ర్ ను పూర్తిగా మార్చేశారు. దీంతో టీమిండియా 200 నుంచి 250 వ‌ర‌కు ప‌రుగులు చేసే ఛాన్సు ఉండేది. కానీ సంజూ శాంస‌న్ ను ఇవాళ్టి మ్యాచ్ లో ఆడించ‌లేదు సూర్య కుమార్ యాద‌వ్‌. అక్ష‌ర్ ప‌టేల్ లాంటి అప్పుడ‌ప్పుడు పేలే ఆల్ రౌండ‌ర్ ను బ్యాటింగ్ కు దింపారు కానీ… సంజూ శాంస‌న్ లాంటి భ‌యంక‌ర‌మైన ప్లేయ‌ర్ ను బ‌రిలోకి దించలేదు.  ఈ మ్యాచ్ లో టాస్ ఓడి… మొద‌ట బ్యాటింగ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ త‌రుణంలోనే.. అత్య‌త్ప స్కోరు చేసింది టీమిండియా. 200 నుంచి 250 ప‌రుగులు చేయాల్సిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవ‌ర్లలో 6 వికెట్లు నష్ట‌పోయి కేవ‌లం 168 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. యంగ్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ 75 ప‌రుగులు చేయ‌గా.. గిల్ 29 ప‌రుగులు చేశాడు. చివ‌ర‌లో హ‌ర్ధిక్ పాండ్యా 38 ప‌రుగులు చేసి జ‌ట్టును ఆదుకున్నారు. లేక‌పోతే ఆ మాత్రం స్కోర్ చేసిది. ఈ ముగ్గురు రాణించ‌డంతో టీమిండియా బ‌య‌ట‌ప‌డింది.

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

Kranti Gaud: 2012 జాబ్ పీకేశారు, కానీ లేడీ బుమ్రా దెబ్బ‌కు తండ్రికి పోలీస్ ఉద్యోగం..ఇది క‌దా స‌క్సెస్ అంటే

MS Dhoni: ధోని ఒకే ఒక్క ఆటోగ్రాఫ్‌..రూ.3 ల‌క్ష‌లు కాస్త, రూ.30 కోట్లు ?

RCB For Sale: RCB పేరు మార్పు, ఇక‌పై ZCB…బెంగ‌ళూరు జ‌ట్టుకు కొత్త ఓన‌ర్ ఎవ‌రంటే ?

IND VS SA: ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, షెడ్యూల్‌, బ‌లాబ‌లాలు ఇవే..ఉచితంగా ఎలా చూడాలంటే

Hong Kong Sixes 2025 : హార్దిక్ పాండ్యాను కాపీ కొట్టిన పాకిస్తాన్..ఛీ.. ఛీ ఎంతకు తెగించార్రా

IPL 2026: SRH జ‌ట్టులో ఫిక్సింగ్..అంబానీతో చేతులు క‌లిపి ద‌గా, కావ్యపాప స్కెచ్ చూడండి !

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్‌, వేదిక‌లు ఇవే…హైద‌రాబాద్, విశాఖ‌కు అన్యాయం ?

Cricket players : ఇప్ప‌టి క్రికెట‌ర్లు ఆ వైట్ క్రీమ్ ను ఎందుకు వాడ‌టం లేదో తెలుసా..?

Big Stories

×