Tumbbad Sequel Update : మరాఠీ చిత్రం ‘తుంబాడ్’ (Tumbbad) బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ సీక్వెల్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ లవర్స్ కి తాజాగా మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. మరి ‘తుంబాడ్’ సీక్వెల్ (Tumbbad Sequel) గురించి మేకర్స్ వెల్లడించిన ఆ సాలిడ్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం పదండి.
మరాఠీ చలనచిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ‘తుంబాడ్’ (Tumbbad Sequel) అనే హారర్ మూవీ క్రియేట్ చేసిన సంచలనం అంతా కాదు. 2018 అక్టోబర్ 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి, భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. సోహమ్ షా, రుద్ర సోని, మాధవ్ హరి జోషి, హరీష్ ఖన్నా, జ్యోతి మల్షే తదితరులు ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషించారు. అయితే సినిమాలో చెప్పుకోదగ్గ స్టార్స్ ఎవరూ నటించకపోవడంతో పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే మూవీని రిలీజ్ చేశారు. అయినప్పటికీ ఈ మూవీ ఏకంగా 13.6 కోట్లు కొల్లగొట్టింది. అలాగే 64వ ఫిలింఫేర్ అవార్డ్స్ వేడుకలో ఏకంగా మూడు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ మూవీ ఓటిటిలో రిలీజ్ అయ్యాక మూవీ జనాలకి పిచ్చపిచ్చగా నచ్చేసింది. దీంతో ‘తుంబాడ్’ (Tumbbad) సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.
అక్కడితో ఈ మూవీ సంచలనం ఆగిపోలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ 13న దేశవ్యాప్తంగా పలు థియేటర్లలో ‘తుంబాడ్’ (Tumbbad)మూవీ రిలీజ్ అయింది. అయితే ఆశ్చర్యకరంగా ఆ సినిమా వచ్చి ఆరేళ్లు పూర్తయినప్పటికీ ప్రేక్షకులు సెకండ్ టైమ్ కూడా థియేటర్లలో బాగా ఆదరించారు. రీ రిలీజ్ టైమ్ లో కూడా ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. నిజానికి చిన్న సినిమా అనే ట్యాగ్ తో రిలీజ్ కావడం వల్ల 2018లో ఈ మూవీకి పెద్దగా లాభాలు రాలేదు. కానీ రీ రిలీజ్ అయ్యాక మాత్రం కాసుల వర్షం కురిసింది. ఇక ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీకి సీక్వెల్ ఉండబోతుందని ఇప్పటికే సినిమా నిర్మాతలలో ఒకరైన సోహమ్ షా వెల్లడించారు. ఈ మూవీకి దర్శకత్వం వహించిన రాహి అనిల్ బరావే ‘తుంబాడ్ 2’ (Tumbbad Sequel) సినిమాకు కూడా దర్శకత్వం వహించబోతున్నారు. తాజాగా ఆయన ఈ సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ క్రేజీ థ్రిల్లర్ కు ఒకటి కాదు ఏకంగా రెండు సీక్వెల్స్ ఉంటాయని చెప్పి ఆడియన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చారు. కాగా ‘తుంబాడ్’ రెండో భాగం 2026 లో మొదలవుతుందని డైరెక్టర్ రాహి అనిల్ బరావే తెలిపారు. ఇక ఈ గుడ్ న్యూస్ తో ‘తుంబాడ్’ సీక్వెల్ (Tumbbad Sequel) కోసం ఎదురు చూస్తున్న మూవీ లవర్స్ తెగ ఖుషి అవుతున్నారు. కానీ ఈ మూవీ సీక్వెల్ ఎలా ఉంటుందో చూడాలంటే ఇంకా రెండేళ్ళకు పైగా వెయిటింగ్ తప్పదు అనే వార్త మాత్రం డిసప్పాయింటింగ్ గా ఉంది.