BigTV English

Pushpa 2 Press Meet: మళ్లీ నార్త్‌నే నమ్ముకుంటున్న మేకర్స్.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై కీలక అనౌన్స్‌మెంట్

Pushpa 2 Press Meet: మళ్లీ నార్త్‌నే నమ్ముకుంటున్న మేకర్స్.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై కీలక అనౌన్స్‌మెంట్

Pushpa 2 Press Meet : ప్రస్తుతం టాలీవుడ్ మేకర్స్ అంతా ప్యాన్ ఇండియా మార్కెట్‌పై ఫోకస్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. తెలుగు నేటివిటీకి తగినట్టుగా సినిమాలు తీస్తూనే వాటిని దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కష్టపడుతున్నారు. తెలుగులో ఫ్లాప్ అయిన ఎన్నో సినిమాలకు కూడా నార్త్‌లో విపరీతమైన క్రేజ్ లభించింది. కొన్ని సినిమాలు ఇక్కడ హిట్ అయితే.. అక్కడ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో చాలామంది తెలుగు హీరోలకు ప్యాన్ ఇండియా హీరో అనే ట్యాగ్ పడిపోయింది. ఈ ట్యాగ్ అల్లు అర్జున్‌కు కూడా లభించింది. ఇప్పుడు దానిని కాపాడుకోవడం కోసమే ‘పుష్ప2’ విషయంలో నార్త్‌పై ఫోకస్ చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్.


‘దేవర’ను ఫాలో…

ఒక తెలుగు సినిమా ప్యాన్ ఇండియా వైడ్‌గా విడుదలకు సిద్ధమయ్యిందంటే చాలు.. తెలుగులో చేసినదానికంటే నార్త్‌లోనే ఎక్కువగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. నార్త్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం కోసం టాలీవుడ్ హీరోలు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతోంది. ఇటీవల విడుదలయిన ‘దేవర’ విషయంలో కూడా అదే జరిగింది. కొరటాల శివ, జూనియర్ ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘దేవర’ మూవీకి కూడా నార్త్‌లో ప్రమోషన్స్ గట్టిగానే జరిగాయి. ఆ ప్రమోషన్స్‌కు దర్శకుడు వచ్చినా రాకపోయినా ఎన్‌టీఆరే స్వయంగా వెళ్లి ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు. కానీ తెలుగులో మాత్రం ఒక్క ప్రెస్ మీట్ కూడా జరగలేదు. ‘పుష్ప 2’ (Pushpa 2) విషయంలో కూడా అదే రిపీట్ కానుంది.


Also Read: ‘పుష్ప 2’ నుండి జానీ మాస్టర్ ఔట్

తెలుగులో ఇదీ పరిస్థితి…

‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముంబాయ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు నార్త్‌లో ఎక్కువ రీచ్ తీసుకురావడం కోసం మేకర్స్ అంతా ముంబాయ్‌లో భారీ ఈవెంట్‌నే ప్లాన్ చేయనున్నారు. పైగా సాంగ్ రిలీజ్ ఈవెంట్స్ కూడా ఎక్కువశాతం ముంబాయ్‌లోనే జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీన్ని బట్టి చూస్తే నార్త్ ప్రేక్షకుల్లో ‘పుష్ప 2’పై హైప్ క్రియేట్ చేయడమే మేకర్స్ లక్ష్యం అని తెలుస్తోంది. మరి తెలుగులో ఈవెంట్స్ పరిస్థితి ఏంటి అని ఫ్యాన్స్‌లో డౌట్ మొదలయ్యింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను తృప్తిపరచడం కోసం తెలుగులో కూడా ఒక ఈవెంట్ ప్లాన్ చేయనున్నారట మేకర్స్. దీన్ని బట్టి చూస్తే తెలుగులో కంటే నార్త్‌లోనే ‘పుష్ఫ 2’ హడావిడి ఎక్కువగా కనిపించనుంది.

ఎక్కువ ఫోకస్…

అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప’ను నార్త్ ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ఈ సినిమా తెలుగులో ఎంత హిట్ అయ్యిందో.. హిందీలో కూడా అదే రేంజ్‌లో హిట్ అందుకుంది. నిజానికి ఆ మూవీకి తెలుగు స్టేట్స్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ పాపులారిటీ వచ్చింది. ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. తెలుగులోని డైలాగ్స్, పాటలకు ఫ్యాన్స్‌లో ఏ రేంజ్‌లో రియాక్షన్ లభించిందో.. అంతే కంటే ఎక్కువ హిందీ ప్రేక్షకుల నుండి కూడా ఆదరణ లభించింది. దీంతో ‘పుష్ప 2’ విషయంలో నార్త్ ప్రేక్షకులకు మరింత ఎక్కువ అటెన్షన్ ఇస్తే వారు ఈ మూవీని మరింత ఎక్కువగా ఆదరించే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ మూవీ డిసెంబర్ 5న దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×